
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీ మోడలింగ్.. 40కి పైగా రైళ్లు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గుంతకల్ డివిజన్‌లోని ధర్మవరం స్టేషన్‌లో యార్డ్ రీ మోడలింగ్ పనుల నేపథ్యంలో, రైల్వే శాఖ అనేక కీలక రైళ్లను రద్దు చేసింది.
కొన్ని రైళ్లను మార్గం మళ్లించి, మరికొన్ని పాక్షికంగా రద్దు చేసింది. ఈ మార్పులు గణనీయంగా ప్రయాణికులపై ప్రభావం చూపనున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి
Details
పూర్తిగా రద్దయిన రైళ్లు
తిరుపతి-గుంతకల్ (57403), గుంతకల్-తిరుపతి (57404), తిరుపతి-కదిరి దేవరపల్లి (57405), కదిరి దేవరపల్లి-తిరుపతి (57406) వంటి రోజువారీ రైళ్లు ఏప్రిల్ 15 నుంచి మే 19 వరకూ రద్దు.
KSR బెంగళూరు-ధర్మవరం (06595), ధర్మవరం-KSR బెంగళూరు (06596) మే 5-17 మధ్య రద్దు.
గుంతకల్-హిందూపూర్ (77213), హిందూపూర్-గుంతకల్ (77214) మే 4-18 మధ్య రద్దు.
తిరుపతి-అమరావతి (12765) మరియు అమరావతి-తిరుపతి (12766) మేలో కొన్ని తేదీల్లో రద్దు.
యశ్వంత్‌పూర్-బీదర్, లాతూర్, హస్సన్, సోలాపూర్ మధ్య అనేక రైళ్లు మేలో వివిధ తేదీల్లో రద్దయ్యాయి.
Details
పాక్షికంగా రద్దైన రైళ్లు
నర్సాపూర్-ధర్మవరం (17247) కదిరి వరకు మాత్రమే సేవలు.
ధర్మవరం-నర్సాపూర్ (17248) కదిరి నుంచి ప్రారంభం.
మచిలీపట్నం-ధర్మవరం (17215) అనంతపురం వరకు.
ధర్మవరం-మచిలీపట్నం (17216) అనంతపురం నుంచి బయలుదేరుతుంది.
Details
మార్గం మార్చిన రైళ్లు
CSMT ముంబై-త్రివేండ్రం, తిరుపతి-అకోలా, సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-మదురై, యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్, హుబ్బిలి-మైసూర్, అజ్మీర్-KSR బెంగళూరు వంటి అనేక రైళ్లు గుత్తి, రేణిగుంట, బళ్లారి, డోన్ వంటి మార్గాల మీదుగా మళ్లించారు.
ఈ మార్పులు ఏప్రిల్ 15 నుండి మే 20 వరకు అమలులో ఉంటాయి.
ప్రయాణికులు ముందుగా తమ ట్రైన్ స్టేటస్‌ను పరిశీలించి, ప్రయాణానికి సంబంధించిన సవరించిన వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.