
Yogi Adityanath on Gyanvapi: జ్ఞానవాపిని మసీదు అనడం చారిత్రక తప్పిదం; యోగి ఆదిత్యనాథ్ సంచలన కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
జ్ఞానవాపి మసీదు సర్వేపై ఉత్తర్‌ప్రేదశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకు ఈ విషయంలో దాదాపు మౌనంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ జ్ఞానవాపిని మసీదుగా అంగీకరించేందుకు నిరాకరించారు. స్వయంగా ముఖ్కమంత్రే ఈ వాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.
జ్ఞానవాపిని మసీదు అని పిలవడమే వివాదంగా మారిందని యూపీ సీఎం యోగి అన్నారు.
దీనికి సంబంధించి ముస్లిం వైపు చారిత్రక తప్పిదం జరిగిందన్నారు. తప్పు జరిగిందన్న ప్రతిపాదన ముస్లిం సమాజం నుంచి రావాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
జ్ఞానవాపి ప్రాంగణంలో దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని, వాటిని హిందువులు ఎవరూ ఉంచలేదని యోగి అన్నారు. మసీదు లోపలికి త్రిశూలం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
యూపీ
వివాదాన్ని పరిష్కరించాలి: యోగి
జ్ఞానవాపి ప్రాంగణంలో జ్యోతిర్లింగం ఉందని, దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయని యూపీ సీఎం యోగి అన్నారు. జ్ఞానవాపిలోని గోడలన్నీ ఏం చెబుతున్నాయో ఒకసారి చూడాలన్నారు.
వివాదాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదిలా ఉంటే, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష పార్టీల కూటమికి 'ఇండియా' అని పేరు పెట్టడంపై విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష కూటమిని 'ఇండియా' అని పిలవవద్దని, ఇది 'డాట్ డాట్ డాట్' గ్రూప్ అని అన్నారు. బట్టలు మార్చుకోవడం వల్ల గత కర్మల నుంచి విముక్తి లభించదని ఎద్దేవా చేశారు.
జ్ఞాన్‌వాపీ క్యాంపస్ సర్వే వ్యవహారం అలహాబాద్ హైకోర్టులో కొనసాగుతోంది. ఈ సర్వేను నిర్వహించాలని హిందూ పక్షం డిమాండ్ చేస్తుండగా.. ముస్లింల నుంచి మాత్రం సర్వేను ఆపాలని డిమాండ్ చేశారు.