Sanatana Dharma Row:రావణుడు,కంసుడు సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టడంలో విఫలమయ్యారు.. సనాతన ధర్మంపై ఆదిత్యనాథ్
సనాతన ధర్మంపై గతంలో జరిగిన అనేక దాడులు ఎటువంటి నష్టాన్ని కలిగించలేకపోయాయని,ఈరోజు కూడా శక్తి ఆకలితో ఉన్న"పరాన్నజీవి" ద్వారా ఎటువంటి హాని జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వివాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం ఆయన స్పందించారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలన్న"విఫలమైన రావణుడి అహంకారం,కంసుని గర్జనలు కూడా ఎందుకూ కొరగాకుండా పోయాయన్న ఆయన,బాబర్, ఔరంగజేబుల దురాగతాలను కూడా నిర్ములించలేకపోయాయని అలాంటి సనాతనాన్ని,ఈ చిల్లర శక్తులతో పరాన్నజీవులు తుడిచిపెట్టేస్తాయా "అంటూ ప్రశ్నించారు ఆదిత్యనాథ్. సనాతన ధర్మాన్ని సూర్యుని శక్తి వనరుగా అభివర్ణించారు ఆదిత్యనాథ్. "సూర్యుడిపై ఒక మూర్ఖుడు సూర్యునిపై ఉమ్మివేయాలని చూస్తారని, అయితే అది తిరిగి వారి ముఖంపైనే పడుతుందని" అన్నారు.
500 సంవత్సరాల క్రితమే సనాతన ధర్మాన్నిఅవమానించారు
ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించిన సీఎం.. వారి చేష్టల వల్ల వారి భావి తరాలు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందన్నారు. భారతదేశ సంప్రదాయం పట్ల గర్వపడాలని ఆయన ఉద్ఘాటించారు. దేవుణ్ణి నాశనం చేయాలని ప్రయత్నించిన వారందరూ తమను తాము నాశనం చేసుకున్నారు. సనాతన ధర్మం 500 సంవత్సరాల క్రితమే అవమానించబడింది. నేడు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తున్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని, భారతదేశ ప్రగతికి ఆటంకం కలిగించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ అది పని చేయదు, "అని ఆదిత్యనాథ్ అన్నారు.