Page Loader
YS Sharmila: వైయస్ భారతికి షర్మిల కౌంటర్.. అవినాష్ రెడ్డిపై విమర్శలు 
వైయస్ భారతికి షర్మిల కౌంటర్.. అవినాష్ రెడ్డిపై విమర్శలు

YS Sharmila: వైయస్ భారతికి షర్మిల కౌంటర్.. అవినాష్ రెడ్డిపై విమర్శలు 

వ్రాసిన వారు Stalin
May 08, 2024
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

వై.ఎస్.జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన కామెంట్స్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. మీరే అధికారంలో ఉండాలి,మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి. ఇదేనా వైఎస్ భారతి స్ట్రాటజీ అంటూ విమర్శలు చేశారు. మిగతా వాళ్లందరినీ గొడ్డలితో నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌ అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఎంపీ అవినాష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎంపీగా అవినాష్ గెలిస్తే నేరం గెలిచినట్లేనన్నారు. ఓటమి భయంతో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఊరు దాటేందుకు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు.

Details 

గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. 

ఎన్నికల్లో ఓడిపోతే అరెస్టు తప్పదనే భయంతో అవినాష్‌ రెడ్డి ఉన్నారన్నారు. కడపలో వైసీపీ సింగిల్‌ ప్లేయర్‌ అంటూ సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు. కడప ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటు వేయాలని, ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్‌ రెడ్డికి ఓటెయ్యాలన్నారు. దేవుడు తమ వైపే ఉన్నారని, గొడ్డలితో నరికే వాళ్ల వైపు కాదని వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. మీరే అధికారంలో ఉండాలి, మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి. ఇదేనా వైఎస్ భారతి స్ట్రాటజీ అన్నారు.