
#YuvaGalam: పొదలాడ వద్ద నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం ఉదయం కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పొదలాడ నుంచి యువ గళం పాదయాత్రను పునఃప్రారంభించారు.
సెప్టెంబర్ 9న స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో తన తండ్రి, టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో లోకేశ్ పొదలాడ వద్ద పాదయాత్రను నిలిపివేశారు.
ఈ క్రమంలో ఆపేసిన చోటు నుంచే దాదాపు 79 రోజుల విరామం తర్వాత లోకేష్ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. వాస్తవానికి పాదయాత్రను ఇచ్ఛాపురంలో ముగించాలని లోకేశ్ అనుకున్నారు.
అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పాదయాత్రను విశాఖలోనే ముగించాలని లోకేశ్ భావిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీడీపీ ట్వీట్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర... అద్భుత ప్రజా స్పందనతో ఈరోజు ఘనంగా పునః ప్రారంభమైంది. ప్రజలారా... రండి! యువనేతను కలిసి మీ సమస్య చెప్పండి. మీ సమస్యల పరిష్కారానికి తెలుగుదేశం ఇస్తున్న భరోసా అందుకోండి.#YuvaGalamPadayatra… pic.twitter.com/EJ8uBjECs9
— Telugu Desam Party (@JaiTDP) November 27, 2023