Page Loader
Rangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!
పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!

Rangoli Tips: పది నిమిషాల్లో అందమైన ముగ్గు.. రంగులు నింపడానికి సులభమైన చిట్కాలను పాటించండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భోగి, సంక్రాంతి పండుగలలో ఇంటి ముందు ముగ్గు వేయడం, దానిని అందంగా అలంకరించడం అనేది ప్రతి ఇంటి ఆచారం. అయితే ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంటుంది. కొన్ని చిట్కాలను పాటిస్తే, మీరు త్వరగా, సులభంగా పెద్ద ముగ్గును రంగులతో నింపవచ్చు. ఈ పండుగకు మీరు ఇంటి ముందు ఎంత పెద్ద ముగ్గు వేసినా పదినిమిషాల్లో రంగులు నింపే ట్రిక్స్ ఎంటో చూడండి. 1)ప్లాస్టిక్ కప్ సహాయం ప్లాస్టిక్ టీ కప్పులని తీసుకుని, వాటి అడుగు భాగానికి సూది లేదా పిన్నీస్‌తో చిన్న రంథ్రాలు చేయండి. ఈ కప్పులో రంగులు నింపి, అది ముగ్గులో వేయండి. కప్పులో రంగులు నింపిన తర్వాత, మీ ముగ్గు ఆలస్యం లేకుండా త్వరగా, అందంగా నింపనుంది.

Details

 2 వాటర్ బాటిల్ సహాయం 

ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను తీసుకుని, సగం కట్ చేసి, దానిలో నెట్ క్లాత్ పెట్టండి. బాటిల్ లో రంగులు నింపి, అప్పుడు బాటిల్‌ను మూతకు రంథ్రాలు చేసి, రంగులు త్వరగా, సమంగా చల్లగావ్వడానికి ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించి, మీరు ముగ్గులో రంగులను చల్లడం త్వరగా పూర్తి చేయవచ్చు. 3. జల్లెడ సాయం టీ జల్లెడ లేదా పిండి జల్లెడ ఉపయోగించి, చెక్కపెట్టిన రంగులను సమయం కోల్పోకుండా చల్లచ్చు. రంగులను జల్లెడలో నింపి, ఇక్కడ పెద్ద డిజైన్లు లేదా చిన్న పువ్వుల కోసం, వాటిని ఎక్కువ సమయం తీసుకోకుండా వేయవచ్చు. ఇలా చేస్తే, రంగులు త్వరగా, సమంగా చల్లచ్చు.

Details

 4. పౌడర్ డబ్బా సహాయం 

పౌడర్ డబ్బా ఉపయెగించి, ముందు నుంచి ఉండే రంథ్రాలతో రంగులను వేయడం. పౌడర్ డబ్బాకు మరొక రెండు రంథ్రాలు చేసి, రంగులను తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతంలో చల్లే అవకాశం ఉంటుంది. ఇది కూడా, రంగులను చల్లడానికి అత్యంత సులభమైన మార్గం. ఈ చిట్కాలు పాటిస్తే, మీరు సంక్రాంతి పండుగ రోజున ముగ్గులు వేయడం చాలా సులభం, కేవలం పది నిమిషాల్లో రంగులతో నింపుకోవచ్చు!