Indrakeeladri: అమ్మలగన్నమ్మ.. ఇంద్రకీలాద్రిపై దుర్గామాత మహత్యం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి విశిష్టమైన చరిత్ర ఉంది. 'విజయవాడ' అనే పేరు విజయ వాటిక నుంచి పుట్టింది. ఇది విజయస్థలం అని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మాండపురాణంలో ఇంద్రకీలాద్రి, కనకాచల పేర్లను ఈ ప్రదేశానికి కీర్తించారు. ఈ ప్రాంతంలోనే దుర్గాదేవి రాక్షసుడైన దుర్గమాసురుడిని సంహరించిందని, అలాగే అర్జునుడు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేసిన ప్రదేశం ఇదే అని చెబుతారు. పురాణాల ప్రకారం మహిషాసురుడిని సంహరించిన అనంతరం, ఇంద్రాది దేవతల కోరికపై దుర్గాదేవి ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా కొలువుదీరిందని చెబుతారు. ఈ ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలో పనులు పూర్తి
గోపురానికి బంగారు తాపడం 2000 సంవత్సరంలో ప్రధాన ఆలయ గోపురానికి బంగారు తాపడం చేసే ప్రణాళిక రూపొందింది. 2003లో పావు భాగం గోపురానికి బంగారు తాపడం చేసి, ఆలయం ఎదుట బంగారు ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. 2008లో గోపురం పూర్తి స్థాయిలో స్వర్ణ తాపడం పొందింది. ఘాట్ రోడ్డు అభివృద్ధి ఒకప్పుడు దుర్గగుడి ఘాట్‌రోడ్డు కాలిబాటగా ఉండేది. భక్తులు మెట్లు ఎక్కి ఆలయానికి చేరుకునేవారు. కానీ కాలక్రమంలో రహదారిగా మారింది. ఇది భక్తులకు సౌకర్యం కల్పించింది. చాళుక్యుల కాలం చాళుక్యుల కాలంలో అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందింది. రాజగోపురం నిర్మాణానికి 1985లో ఎన్టీఆర్ ప్రణాళికలు రూపొందించగా, చంద్రబాబు హయాంలో 2015లో పనులు పూర్తయ్యాయి.