బల్గేరియా పర్యటనలో చేయకూడని తప్పులేమిటో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
యూరప్ ఖండంలో బల్గేరియా మంచి పర్యాటక దేశంగా చెప్పుకోవచ్చు. నల్లసముద్రం, సముద్ర తీరాలు.. అన్నీ చూడవలసినవే. అయితే బల్గేరియా వెళ్ళినపుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే అక్కడి స్థానికుల వల్ల మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బల్గేరియా దేశంలో స్థానికులకు కోపం తెప్పించకుండా ఉండాలంటే చేయకూడని పనులు.
బల్గేరియన్ లిపిని రష్యన్ లిపితో పోల్చవద్దు:
బల్గేరియా, రష్యా భాషల లిపి దాదాపు ఒకేరకంగా ఉంటుంది. మీరు బల్గేరియా స్క్రిప్ట్ చూసి, రష్యన్ స్క్రిప్ట్ అని అనవద్దు.
తెలియని వాళ్లతో మరీ క్లోజ్ గా ఉండవద్దు:
బల్గేరియా దేశస్తులు తెలియని వారితో దూరం దూరంగానే ఉంటారు. మీరు వెళ్ళి మరీ క్లోజ్ గా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు.
పర్యాటకం
బల్గేరియాలో చేయకూడని పొరపాట్లు
పిడికిలి బిగించేటపుడు జాగ్రత్త:
బొటన వేలిని మధ్యవేలు, చూపుడు వేలు మధ్యలో ఉంచి పిడికిలి బిగించవద్దు. దాన్ని వారు సీరియస్ గా భావిస్తారు. ఇలా చేయడం, అవతలి వారిని అవమానించడమే. మహిళల జననేంద్రియాలను సూచిస్తూ అవమానించినట్టు వాళ్ళు ఫీలవుతారు.
అతిధిగా ఆహ్వానిస్తే ఉట్టి చేతులతో వెళ్ళకండి
మిమ్మల్ని ఎవరైనా వాళ్ల ఇంటికి ఆహ్వానిస్తే, ఉట్టి చేతులతో ఊపుకుంటూ వెళ్ళకండి. ఏదైనా బహుమతి తీసుకెళ్ళండి. అలా చేస్తే వారి ఆతిథ్యాన్ని మీరు గౌరవించినట్టుగా వాళ్ళు భావిస్తారు. బహుమతి ఇచ్చేటపుడు రెండు చేతులతో ఇవ్వండి.
మీరు ఆడవాళ్ళయితే రోడ్ల మీద సిగరెట్ తాగవద్దు:
ఆడవాళ్ళకుండే కొన్ని ప్రత్యేక నియమాల్లో ఇదొకటి. రోడ్డు మీద నడుస్తూ సిగరెట్ తాగితే వాళ్ళు ఇబ్బంది పడతారు.