
బతుకమ్మ పండగ: 9 రోజుల బతుకమ్మ, 8రకాల నైవేద్యాల గురించి తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బతుకమ్మ పండగను చాలా ఘనంగా చేస్తారు. ఆడబిడ్డల పండగగా బతుకమ్మ పండగను చెప్పుకుంటారు.
ఆడబిడ్డలంతా కలిసి గునుగు, తంగేడు పూలతో కలిసి బతుకమ్మను తయారు చేస్తారు. ఆ తర్వాత బతుకమ్మ ఆడి దగ్గర్లోని చెరువులో నిమజ్జనం చేస్తారు.
తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకుంటారు. తొమ్మిది రోజులు బతుకమ్మను తయారు చేసి 8రకాల నైవేద్యం సమర్పిస్తారు.
మొదటి రోజు - ఎంగిలిపూల బతుకమ్మ:
భాధ్రపద అమావాస్య నాడు బతుకమ్మ పండగ ప్రారంభం అవుతుంది. మొదటిరోజున ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజున బియ్యంపిండి, నువ్వులను నైవేద్యంగా సమర్పిస్తారు.
Details
రెండవ రోజు - అటుకుల బతుకమ్మ
ఈరోజున అటుకులు, బెల్లం, సప్పిడి పప్పు కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
మూడవ రోజు - ముద్దపప్పు బతుకమ్మ:
ఈరోజున ముద్దపప్పు, బెల్లం, పాలను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.
నాలుగవ రోజు: నానబియ్యం బతుకమ్మ:
ఈరోజున నానబియ్యం, బెల్లం, పాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
ఐదవ రోజు - అట్ల బతుకమ్మ:
ఈరోజున అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిని గోధుమ పిండితో తయారు చేస్తారు.
Details
ఆరవ రోజు - అలిగిన బతుకమ్మ
ఈరోజు బతుకమ్మ అలుగుతుంది. అందుకని ఈరోజు నైవేద్యం సమర్పించరు.
ఏడవరోజు - వేపకాయల బతుకమ్మ:
సకినాల పిండితో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
ఎనిమిది రోజు: వెన్నముద్దల బతుకమ్మ:
బెల్లం, నువ్వులు, వెన్న వంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
తొమ్మిదవ రోజు: సద్దుల బతుకమ్మ:
ఈరోజు పులిహోర, పెరుగన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి అన్నం మొదలగు వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు.