LOADING...
Yama Deepam: దీపావళికి ముందు యమ దీపం.. ఏ రోజున వెలిగించాలంటే?
దీపావళికి ముందు యమ దీపం.. ఏ రోజున వెలిగించాలంటే?

Yama Deepam: దీపావళికి ముందు యమ దీపం.. ఏ రోజున వెలిగించాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
01:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐదు రోజుల దీపావళి పండుగలో మొదటి రోజు ధన త్రయోదశి గా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం (చీకటి పక్షం) త్రయోదశి రోజున, మరణానికి అధిపతి యమ ధర్మ రాజు పేరుతో యమ దీపం వెలిగిస్తారు. యముడి ఆశీస్సులు లభించి ఆరోగ్యం మంచిగా ఉండటానికి, భయాల నుంచి ఉపశమనం పొందటానికి దీపం వెలిగించడం చాలా ముఖ్యం. యమ దీపం వెలిగించే సమయం హిందూ క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి తిథి 2025లో అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, యమ దీపం అక్టోబర్ 18వ తేదీన శనివారం వెలిగించాలి.

Details

దిశ 

యమ దీపాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపున ఉంచి వెలిగించాలి, ఎందుకంటే దక్షిణ దిశను యమ ధర్మ రాజు దిశగా పరిగణిస్తారు. ఈ విధంగా దీపం వెలిగించడం వల్ల యముడు సంతోషిస్తాడు, అదే విధంగా భయాల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Details

యమ దీపం వెలిగించే నియమాలు 

1.యమ దీపం నాలుగు వైపులా ఉండాలి. మరియు నాలుగు వత్తులు వెలిగించాలి. 2.దీపం కోసం నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఉపయోగించాలి. 3.దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో బయట దక్షిణ దిశలో ఉంచాలి. 4.దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులు దీర్ఘాయుష్షు, సుఖసంతోషం మరియు కష్టాల నుండి విముక్తి కోసం ప్రార్థించాలి. 5.దీపాన్ని ఇంట్లో బయట దక్షిణ దిశలో పెట్టడం చాలా ముఖ్యము. 6. దీపాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, అకాల మరణ భయం లేకపోవడం వంటి పనులు పొందుతారు. ఈ విధంగా ధన త్రయోదశి రోజున యమ దీపం వెలిగించడం, దాని సరైన దిశ, సమయ, నియమాలు పాటించడం ద్వారా పండుగ శుభకరంగా జరుపుకోవచ్చు.