LOADING...
Butterfly Pea Flowers: శంకుపుష్పం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Butterfly Pea Flowers: శంకుపుష్పం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

Butterfly Pea Flowers: శంకుపుష్పం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు

వ్రాసిన వారు Stalin
Nov 07, 2023
03:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

శంకుపుష్పాల(Butterfly Pea Flowers)ను సాధారణంగా డెకరేషన్ కోసం పెంచుతుంటారు. అయితే ఈ పుష్పాల్లో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. శంకుపుష్పాలతో పాటు ఆకులు, వేర్లు, విత్తనాల అన్నింట్లోనూ ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శంకుపుష్పాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుుకుందాం. బరువు తగ్గడం.. శంకుపుష్పాలు బరువు తగ్గడంలో సాయపడుతాయి పలు అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి. ఈ మొక్కలో ఉండే భాగాలు కొవ్వు కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తాయి. తద్వారా ఫ్యాటీ లీవర్ వ్యాధికి ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.

పుష్పాలు

రోగనిరోధక శక్తి పెరుగుదల

శంకుపుష్పాల టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డ్యామేజింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉండే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. ఈ పానీయం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, మెటబాలిక్ సిండ్రోమ్, హైపర్ కొలెస్టెరోలేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. చర్మ మృదువుగా.. శంకుపుష్పాలను టీ చేసుకొని తాగడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ డ్రింక్‌లోని యాంటీ ఆక్సిడెంట్ల చర్మాన్ని నిత్య యవ్వనంగా ఉంచుతాయి. అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణ శంకుపుష్పాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల స్టోర్హౌస్ ఉంటాయి. ఇవి జుట్టును ధృడంగా చేస్తాయి. జుట్టు పెరగడానికి దోహదపడుతుంది. శంకుపుష్పాల టీలో ఉండే ఆంథోసైనిన్ స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచుతుంది.