Page Loader
Christmas : ఈ క్రిస్మస్​కి మీ నివాసాన్ని ఈజీగా, ట్రెండీగా ఇలా మార్చేయండి
ఈ క్రిస్మస్​కి మీ నివాసాన్ని ఈజీగా, ట్రెండీగా ఇలా మార్చేయండి

Christmas : ఈ క్రిస్మస్​కి మీ నివాసాన్ని ఈజీగా, ట్రెండీగా ఇలా మార్చేయండి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 18, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్ మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే. ట్రెండీగా, మరింత ఆకర్షణీయంగా, అందంగా తీర్చిదిద్దేందుకు కళా పోషణ కావాలి. మీ ఇంటిని ఎలా అట్రాక్షన్'గా, ట్రెండీగా మార్చాలని భావిస్తే వాటికి కొన్ని ఈజీ టిఫ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మీరు ఫాలో కాగలిగే ట్రెండీ టిప్స్​ ఏంటంటే : అలంకరణలో ఇవి కీలకం.. మనం ఏ అలంకరణ చేసినా అది రెండు ప్రయోజనాలు ఇచ్చేదిగా ఉంటే బాగుంటుంది. కేవలం చూసేందుకు మంచిగా కాకుండా దాంతో అట్రాక్ట్ లుక్ రావాలి. ఉదాహరణకు మీ ఇంట్లో ఓ సెల్ఫ్​ని క్రిస్మస్​ ట్రీగా ఊహించుకుని అందులో మీరు ఫ్రెండ్స్​కి ఇచ్చే గిఫ్ట్స్ పెట్టి దానికి లైటింగ్స్ సెట్​ చేయవచ్చు.

DETAILS

కుర్చీలకు బదులుగా అవి వాడుకోవచ్చు

ఫలితంగా గిఫ్ట్స్ ఎక్కడపెట్టామో వెతుక్కో అవసరం లేకుండా ఉంటుంది. పుస్తకాల అరలకు దండలు వేయడం, కుర్చీ కాళ్ల చుట్టూ ఫెయిరీ లైట్లు పెట్టడం లేదా క్యాబినెట్ హ్యాండిల్స్​కు వాటిని వేలాడదీయవచ్చు. ఫర్నీచర్ కోసం : మీ లివింగ్​ రూమ్​లో సాధారణ కుర్చీలకు బదులుగా సౌకర్యవంతమైన ఫ్లోర్ కుషన్​లు, కాఫీ టేబుల్స్​పాతకాలపు ట్రంక్స్​ లేదా సైడ్​ టేబుల్స్​ను పేర్చవచ్చు. వీటిని బహుమతులుగా ప్యాక్ చేసి సపోర్ట్​గా వాడుకోవచ్చు. మొక్కలతో ఇంట్లో ఎక్కువ జాగా ఉంటే మీరు మొక్కలను మీ డెకరేటింగ్ వస్తువులుగా మార్చేసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్​ని ఇంట్లోకి పెట్టుకోవచ్చు. క్రిస్మస్ సమయంలో మొక్కలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. క్రిస్మస్​ ట్రీ మాదిరిగా మొక్కలను మార్చేయవచ్చు. ఇది మీ ఇంటికి అదనపు లుక్​ని గ్యారెంటీ ఇస్తుంది.

DETAILS

ఇది మీ క్రిస్మస్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

ఆ మొక్కలుకు మీరు చిన్నచిన్న లైట్స్ డెకరేట్ చేస్తే.. మీరు మరే ఇతర వస్తువులు కొనాల్సిన అవసరం ఉండదు. వాటికి సున్నితమైన ఆభరణాలు, చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా హ్యాంగ్ చేయవచ్చు. ఇది మీ క్రిస్మస్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. సువాసనలతో : ఇక సువాసనలతో నిండిన ఫాబ్రిక్స్ మీ మూడ్​ని మరింత రెట్టింపు చేసేస్తుంటాయి. మంచి సువాసనగల సుగంధ ద్రవ్యాలతో నిండిన చిన్న చిన్న సంచులు మీరు ఇంట్లో హ్యాంగ్ చేసుకోవచ్చు. కాదంటే సువాసనలు కలిగిన క్యాండిల్స్​ను మీరు వెలిగించవచ్చు. ఇవి ఇంటికి అదనపు మెరుగులను కలిగిస్తాయి. లావెండర్, వెనిలా వంటి సువాసనలతో కూడిన క్యాండిల్స్, డిఫ్యూజర్స్​లు మార్కెట్లలో అందుంబాటులోనే ఉంటాయి కాబట్టి వాటిని ట్రై చేసుకుంటే సరి.