
దసరా నవరాత్రి ఉత్సవాలు: నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవి గా అమ్మవారి దర్శనం
ఈ వార్తాకథనం ఏంటి
దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో కొలుస్తారు. అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణలో పూజిస్తారు.
ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఎర్రని కలువ పూలతో అమ్మవారిని పూజించాలని చెబుతారు.
మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
ఈ రోజున అమ్మవారికి క్షీరాన్నం, పానకం, వడపప్పు, పూర్ణం బూరెలను నైవేద్యంగా సమర్పిస్తారు.
మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని పూజించడం వల్ల మనుషుల్లోని కామ, క్రోధ లక్షణాలు తొలగిపోయి సద్బుద్ధి కలుగుతుంది.
Details
ఈరోజు పఠించాల్సిన స్తోత్రాలు
ఈ రోజున భక్తులు, యా దేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ్ సంస్థితా అనే మంత్రం పఠిస్తూ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారిని పూజించాలి.
అంతేకాదు ఈరోజు కనకధార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం పాటించడం వల్ల మంచి జరుగుతుంది. ఇంకా శ్రీ సూక్తం, లక్ష్మీ సహస్రం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అంటారు.
మహాలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారిని పూజించడం వల్ల మానసికంగా శారీరకంగా ఆరోగ్యం కలుగుతుందని సిరిసంపదలకు ఎలాంటి లోటు లేకుండా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు.
నవరాత్రుల్లో ఉపవాసం ఉండే భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో అమ్మవారిని పూజించి సాత్వికాహారాన్ని తీసుకోవాలి.