Dasara Navaratri 2023: కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ తినాలనుకుంటే ఇవి ట్రై చేయండి
పండగల సమయంలో స్వీట్స్ ఖచ్చితంగా తింటారు. దసరా నవరాత్రుల సమయంలో రకరకాల తీపి పదార్థాలు తయారు చేస్తారు. అయితే కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే స్వీట్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. స్వీట్ పొటాటో హల్వా: స్వీట్ పొటాటోస్ తీసుకుని బాగా ఉడికించాలి. ఇప్పుడు మరొక పాత్రలో స్వీట్ పొటాటోస్ ని నుజ్జు నుజ్జు చేసి, అందులో పాలు, యాలకుల పొడి, కొన్ని నీళ్ళు వేసి వేయించాలి. నీళ్ళు మొత్తం ఆవిరయ్యాక మీకు నచ్చిన వాళ్ళకు వడ్డించండి. పండ్లు, పెరుగు: మీకు నచ్చిన పండ్లను పెరుగులో కలుపుకుని తినవచ్చు. దీనివల్ల అటు పండ్లలోని పోషకాలు, ఇటు పెరుగులోని పోషకాలు శరీరానికి అందుతాయి.
మఖానా లడ్డు
మఖానా గింజలను తెలుగులో తామర గింజలు అంటారు. మార్కెట్లో మఖానా అంటే సులువుగా దొరుకుతుంది. మఖానా గింజలను పొడి చేయాలి. ఆ తర్వాత బాదం గింజలను కూడా పొడిగా చేసి మఖానా పొడికి కలపాలి. ఆ తర్వాత ఈ పొడి మిశ్రమానికి బెల్లం కలిపి లడ్డూలు తయారు చేయాలి. మఖానా గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి లడ్డు: కొబ్బరితో చేసిన లడ్డూలు భలే రుచిగా ఉంటాయి. దీనికోసం కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుముకు బెల్లం కలిపి పిండిముద్దలా తయారు చేయాలి. ఇప్పుడు ఈ పిండిముద్ద నుండి చిన్నగా లడ్డూలు తయారు చేసుకోవాలి.