Bear Sleep:ఎలుగుబంటి నిద్ర గురించి తెలిస్తే షాక్ అవాల్సిందే.. ఎక్కువ కాలం జీవించాలంటే ఇలా చేయాలట?
సాధారణంగా ఎలుగు బంట్లు చలికాలంలో గాఢంగా నిద్రపోయాయి. ఉత్తర దక్షిణ ధృవాల్లో అత్యంత శీతల వాతావరణంలో జీవించే ఎలుగు బంట్లు సంవత్సరంలో ఏకంగా ఆరు నెలలు నిద్రలోనే ఉంటాయి. ఎందుకంటే ధృవాల్లో ఆరు నెలల పాటు చీకటి ఉంటుంది. కనుక గడ్డకట్టుకుపోయే వాతావరణంలో అవి నిద్రాస్థితికి చేరుతాయి. ఎలుగు బంట్లు ఆరు నెలలు నిద్రలో, మరో ఆరు నెలలు ఆహారం కోసం వేటాడుతాయి. అయితే ఇది మనుషులకు సాధ్యపడుతుందో లేదో మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఒక మనిషి ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రిస్తే చాలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని అధ్యయాలు మాత్రం రోజులో ఎక్కువ సేపు నిద్రపోయే వారు ఎక్కువ కాలం జీవిస్తారని వెల్లడించారు.
ఎలుగుబంటిలా మనిషి నిద్రపోతే శరీరంలోని ఎముకులు కుచించుకుపోతాయి
మరోవైపు వాషింగ్టన్ పోస్టు రిపోర్ట్ చేసిన స్టడీలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నిద్రాణస్థితిలో ఉన్నటువంటి జంతువులు సుదీర్ఘకాలం జీవిస్తాయి. నిజానికి ఎక్కువ సేపు నిద్రపోతే గుండె కొట్టుకొనే రేటు చాలా వరకు తగ్గిపోతుంది. ఒకవేళ ఎలుగుబంటిలాగా మనిషి సుదీర్ఘ కాలం నిద్రపోతే మానవ శరీరంలో ఎముకులు కుచించుకుపోతాయి. మనిషి మెదడు అచేతనంగా రోజుల తరబడి ఉండటం కూడా సాధ్యం కాదు. ఎలుగు బంట్లు ఎక్కువ కాలం నిద్రలో ఉండేందుకు HSP47 ప్రోటిన్ సహకరిస్తుంది. నిజానికి మానవ శరీరంలో ఈ ప్రోటిన్ లేకపోవడం వల్లనే రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టి స్ట్రోక్ వచ్చే ప్రమాదముంది.