శరీర బరువును పెంచుకోవడానికి చేయాల్సిన పనులు ఇవే
బరువు ఎక్కువగా ఉండడం ఎంత అనారోగ్యమో, వయసుకు, ఎత్తుకు తగినంత బరువు లేకపోవడం కూడా అంతే అనారోగ్యం. ఎత్తుకు తగిన బరువు ఖచ్చితంగా ఉండాలి. బరువు తగ్గడానికి ఎలాంటి ఇబ్బందులైతే పడతారో బరువు పెరగడానికి కూడా అంతే ఇబ్బందులు పడతారు. కొంతమంది అనారోగ్యకరమైన దారుల్లో బరువు పెరగాలని చూస్తుంటారు. జంక్ ఫుడ్ తినడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అవన్నీ కరెక్ట్ కాదు. మీరు మీ శరీర బరువును ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. తరచుగా తినాలి: రోజుకు మూడు పూటలు కాకుండా ఐదు లేదా ఆరు పూటలు తినాలి. అయితే ఎక్కువసార్లు తినేటపుడు తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి.
బరువు పెరగడానికి చేయాల్సిన పనులు
పోషకాలున్న ఆహారం: వివిధ రకాల పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోండి. వివిధ రకాల పోషకాలు మీ శరీరానికి అందితే కండలు పెరిగి మంచి లుక్ తో కనిపిస్తారు. కావాల్సినన్ని నీళ్ళు: చాలామంది ఇక్కడ తప్పు చేస్తుంటారు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కావాల్సినన్ని నీళ్ళు తాగాలి. నీటిని తాగడం జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. వ్యాయామం: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీర ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగున్నప్పుడే సమయానికి ఆకలి అవుతుంది. మీకు ఆకలి సరిగ్గా కావాలంటే వ్యాయామం చేయాల్సిందే. స్మూతీస్, షేక్స్: తక్కువ కేలరీలున్న డైట్ సోడా వంటివి కాకుండా స్మూతీస్, షేక్స్ తాగితే శరీరంలోకి ఎక్కువ కేలరీలు వెళతాయి.