
National Watermelon Day: జుట్టుకు, చర్మానికి ఆరోగ్యాన్ని అందించే పుచ్చకాయ ప్రయోజనాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఖనిజలవణాలు, విటమిన్లు, పోషకాలు పుచ్చకాయలో పుష్కలంగా లభిస్తాయి.
శరీరాన్ని హైడ్రేటుగా ఉంచడం నుండి జుట్టుకు, చర్మానికి అనేక ప్రయోజనాలను పుచ్చకాయ అందిస్తుంది.
ఈరోజు జాతీయ పుచ్చకాయ దినోత్సవం కాబట్టి జుట్టుకు, చర్మానికి పుచ్చకాయ చేసే మేలు తెలుసుకుందాం.
చర్మానికి మెరుపు
పుచ్చకాయలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చర్మానికి మెరుపు వస్తుంది. అలాగే చర్మాన్ని తేమగా ఉంచడంలో వాటర్ మిలన్ సాయపడుతుంది.
పై ప్రయోజనాలు మీరు పొందాలంటే నలగగొట్టిన పుచ్చకాయ రసాన్ని చర్మానికి మర్దన చేస్తే సరిపోతుంది.
Details
కొల్లాజెన్ ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు
వయసును తగ్గించే పోషకాలు
చర్మాన్ని యవ్వనంగా ఉంచే పోషకాలైన లైకోపీమ్, విటమిన్ - ఏ, విటమిన్ - సి ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కారణంగా చనిపోయిన మృతకణాలు చర్మం నుండి తొలగిపోయి కొత్త కణాలు పుట్టుకొస్తాయి.
అలాగే కొల్లాజెన్ ని ఆరోగ్యంగా ఉంచడంలో పుచ్చకాయ సహాయపడుతుంది.
జుట్టును బలంగా చేస్తుంది
పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్లు, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటి కారణంగా జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే జుట్టు రాలిపోవడం తగ్గిపోతుంది.
Details
రక్తప్రసరణను మెరుగుపరిచే ఆర్జినిన్
వాటర్ మిలన్ సీడ్ ఆయిల్ ని హెయిర్ కేర్ రొటీన్ లో కలుపుకోవడం వల్ల ఆరోగ్యమైన బలమైన జుట్టును పొందవచ్చు.
జుట్టు పెరుగుదలకు పుచ్చకాయ
పుచ్చకాయలో ఉండే సిట్రల్లీన్, శరీరంలోని ఆర్జినిన్ స్థాయిలను పెంచుతుంది. దీని కారణంగా రక్త ప్రసరణ సరిగ్గా జరిగి జుట్టు పెరుగుతుంది.
అందుకే పుచ్చకాయను ఆహారంలో చేర్చుకోండి.