వరుస పెళ్ళిళ్ళ వల్ల మీ డైట్ దెబ్బతింటుందా? ఇలా చేయండి
వేసవిలో పెళ్ళి ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టాలందరూ తమ తమ ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, దావత్ లకు ఆహ్వానిస్తుంటారు. ఐతే ఇలాంటి టైమ్ లో మీరు పాటించే డైట్ దెబ్బతింటుంది. పెళ్ళికి వెళ్ళినపుడు చుట్టూ రకరకాల ఆహారాలు కనిపిస్తాయి. వాటిని చూస్తే తినాలన్న కోరిక కలుగుతుంది. అలా అని తినకుండా ఉండలేం. అలాంటప్పుడే కొన్ని టిప్స్ పాటించాలి. ముందుగా తినేయండి: పెళ్ళికి వెళ్ళాలనుకున్నప్పుడు తినకుండా వెళ్ళవద్దు. ఇంట్లోనే ఎంతోకొంత తిని వెళ్ళండి. దానివల్ల మీరు అక్కడ కనిపించిన ప్రతీదాన్ని తినాలనుకోరు. ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకోండి: పెళ్ళి వంటల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారాలు కనిపిస్తాయి. సూప్స్, సలాడ్ల మీద దృష్టి పెట్టండీ. పండ్లు కూడా ఉంటాయని గుర్తుంచుకోండి.
కొంచెం తినడం, నీళ్ళు తాగడం పెళ్ళిలో మీ డైట్ ని చెరగకుండా చేస్తాయి
కావాల్సినన్ని నీళ్ళు తాగాలి: పెళ్ళిలో నీళ్ళు ఎక్కువగా తాగండి. దానివల్ల మీకు ఆకలి తగ్గుతుంది. నీళ్ళతో కడుపు నిండుతుంది కాబట్టి మీరు తక్కువ తింటారు. నీళ్ళకన్నా నిమ్మరసం తాగితే ఇంకా మంచిది. కొద్దిగా తినండి: ఏది తిన్నా కూడా తక్కువగా తినడం అలవాటు చేసుకోండి. పెళ్ళిలో మీకు చాలా ఆహారాలు కనిపిస్తాయి. అన్నింటినీ టేస్ట్ చేయలేరు. అలా అని ఒక ఆహారాన్నే నిండుగా తినకూడదు. నాలుక సంతృప్తి కోసం కొద్దిగా తినండి. చెమట కార్చండి: మీకు దగ్గరి వారి పెళ్ళయితే గనక పెళ్ళి పనుల్లో పాల్గొనండి. కేవలం ఫోటోలకు ఫోజులివ్వడానికే కాకుండా పెళ్ళి పనుల్లో బిజీగా గడపండి. దానివల్ల మీరు యాక్టివ్ గా ఉంటారు. ఆహారం కూడా ఎక్కువగా తినలేరు.