అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కలిగి ఉన్న పిల్లలు తినకూడని ఆహారాలు
ఈ వార్తాకథనం ఏంటి
మనం తినే ఆహారాలే మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు ఏ డి హెచ్ డి సమస్యతో బాధపడుతుంటే వారికి కొన్ని ఆహారాలను దూరంగా ఉంచాలి.
ఏ డి హెచ్ డి అంటే ఒక పని మీద దృష్టి పెట్టకపోవడం, ఏదైనా పనిలో వింత వింతగా ప్రవర్తించడం, హైపర్ ఆక్టివ్ గా ఉండడం లాంటివి ఏ డి హెచ్ డి కిందకు వస్తాయి.
సోడాలు, కెఫైన్ కలిగిన కూల్ డ్రింక్స్
వీటిలో పోషకాలు కొంచెం కూడా ఉండవు, ఫ్రక్టోజ్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి మీ పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని పెంచే అవకాశం ఉంది.
పిల్లల పెంపకం
ఏ డీ హెచ్ డీ తో బాధపడే పిల్లలు తినకూడని ఆహారాలు
చేపలు, మెర్క్యూరీ కలిగి ఉన్న సముద్ర ఆహారాలు
మెర్క్యూరీ కలిగి ఉన్న చేపలు లేదా సముద్ర ఆహారాలు అంత తొందరగా జీర్ణం కావు. దానివల్ల మెదడు మీద ప్రభావం పడుతుంది. అప్పుడు శరీరంలో అనేక మార్పులు వస్తాయి.
ఆపిల్
రోజుకో ఆపిల్ తినడం వల్ల డాక్టర్ ని దూరం పెట్టవచ్చని చెబుతారు. కానీ ఇందులో సలిసైటిస్ అనే పదార్థం.. ఏ డి హెచ్ డి తో బాధపడే పిల్లలకు నష్టం కలిగిస్తుంది.
దీనివల్ల హైపర్ ఆక్టివిటీ పెరుగుతుంది. ఒక పని మీద దృష్టి నిలవదు. సలిసైటిస్ అనే పదార్థము ద్రాక్ష, క్రాన్ బెర్రీస్, టమాటా, స్ట్రాబెరీస్ బాదం లో కూడా ఉంటుంది.
ఇంకా ఫ్రోజెన్ ఫుడ్స్, ఫ్రోజెన్ కూరగాయలకు దూరంగా ఉండడం మంచిది.