పిల్లల పెంపకం: మీ పిల్లలు మీ తోడు లేకుండా ఆడుకోవాలంటే మీరు చేయాల్సిన పనులు
పిల్లలతో ఆడటం సరదాగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆడాలనుకున్న ప్రతీసారీ పెద్దలు వెళ్ళి ఆడించడానికి సమయం ఉండదు. అలాంటప్పుడు ఎవరి తోడు లేకుండా ఎలా ఆడుకోవాలో పిల్లలకు నేర్పించాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. మీ పిల్లలకు వివరించండి: ఎవరి తోడు లేకుండా ఎందుకు ఆడుకోవాలో మీ పిల్లలకు వివరించండి. వారి వారి వయసును బట్టి వివరణ ఉండాలి. తోడు లేకుండా ఆడుకోవడం పనిష్మెంట్ కాదని వారికి తెలిసేలా చేయాలి. ఒంటరిగా ఆడే ఆటలను కనిపెట్టండి: ఎవరి సపోర్ట్ లేకుండా ఆడే ఆటలు ఏమేం ఉన్నాయో ఒక లిస్ట్ ప్రిపేర్ తయారు చేయండి. మీ పిల్లలనే కొన్ని ఆటలను కనుక్కోమని చెప్పండి. అది వాళ్ళ క్రియేటివిటీని పెంచే అవకాశం ఉంటుంది.
పెద్దల తోడు లేకుండా పిల్లలు ఆడుకోవడానికి పెద్దలు చేయాల్సిన పనులు
మీ పిల్లలు ఏదైనా ఆటను ఆడుతూ ఆనందిస్తుంటే వాళ్ళను మీరు ఆడుకోనివ్వండి. అనవసరంగా మధ్యలో వెళ్ళి వాళ్ళను డిస్టర్బ్ చేయవద్దు. సురక్షిత ప్రాంతంలో తమకు తామే ఆడుకునేలా ఏర్పాట్లు చేయాలి. పిల్లలు పెద్దల ఎలా చేస్తే అలా చేస్తారు. అందుకే మీరు పిల్లలతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లాడు పుస్తకం చదవాలని మీరు కోరుకుంటే, మీరు కూడా ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండాలి. మీ పిల్లలు తమకు తామే ఆడుకుంటూ ఏదైనా క్రియేటివ్ గా తయారు చేసినపుడు, దానికి తగిన ప్రోత్సాహం ఇవ్వండి. మీ తోడు లేకుండా ఆడుకుంటున్నందుకు వారిని పొగడండి. ఆ పొగడ్తలు వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మరింత బాగా క్రియేటివ్ గా తయారవుతారు.