Oils for Hair: మీ జుట్టు పెరుగుదల, ఆరోగ్యానికి ఈ నూనెలు వాడండి
విపరీతమైన కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈరోజుల్లో జట్టు రాలిపోవడం పరిపాటిగా మారింది. కొన్ని ఆయిల్స్‌ను జుట్టుకు పట్టించడం ద్వారా మీ వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జట్టు ఊడిపోవడం కూడా తగ్గుతుంది. అవేంటో ఏంటో ఇప్పుడు చూద్దాం. లావెండర్ నూనె లావెండర్ ఆయిల్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఈ నూనెను ఎలుకపై ప్రయోగించగా, వేగంగా జుట్టు పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఈ నూనె శిరోజాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 3టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో కొన్ని చుక్కుల లావెండర్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పంట్టించాలి. 10నిమిషాల తర్వాత షాంపూతో స్నానం చేయాలి. వారానికి ఆరుసార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
పూదీన నూనె
పూదీన నూనె లేదా పిప్పరమింట్ ఆయిల్ జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జట్టు పెరుగుదలను ఈ ఆయిల్ తోడ్పతుందని పరిశోధకులు తేల్చారు. ఇది కేవలం జుట్టుకే కాకుండా, ఆరోగ్య సమస్యలకు కూడా ఔషధంగా పని చేస్తుంది. ముఖ్యంగా జలుబు వచ్చిన ఉపశమనం కలిగిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉన్నప్పుడు ఈ నూనెతో మసాజ్ చేస్తే, చాలా రిలీఫ్‌గా ఉంటుంది. మీకు నచ్చిన హైర్ ఆయిల్‌లో 2 చుక్కల పిప్పరమెంటు ఆయిల్ కలిపి, తలకు పట్టించాలి. 5 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే సరిపోతుంది.
లెమన్ గ్రాస్ నూనె
చుండ్రు అనేది ఒక సాధారణ రుగ్మత. దీనితో బాధపడేవారు చాలా మంది ఉంటారు. చుండ్రు ఉండటం వల్ల జట్టు కూడా ఊడిపోతుంటుంది. ఎన్ని లేపనాలు వాడినా చండ్రు సమస్య తగ్గడం లేదు అనే వారికి, లెమన్ గ్రాస్ నూనెను వినియోగించడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. చుండ్రు తగ్గడానికి లెమన్‌గ్రాస్ ఆయిల్ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది ఒక వారం వ్వవధిలోనే చుండ్రును గణనీయంగా తగ్గించిందని 2015లో చేసిన ఓ అధ్యయనంలో తేలింది. లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను ప్రతిరోజు మీ షాంపూ లేదా కండీషనర్‌లో కొన్ని చుక్కలను కలిపి మసాజ్ చేసినట్లు మర్దన చేయాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఒక వారం రోజుల వ్యవధిలోనే చండ్రు సమస్య తీరిపోతుంది.