అతిగా బట్టలు కొనే అలవాటు మీకుందా? ఫ్యాషన్ వేస్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రతి స్టైల్ ఫ్యాషన్ దుస్తులు మీ బీరువాలో ఉన్నట్లయితే మీరు ఫ్యాషన్ వేస్ట్ కి కారణం అవుతున్నారని అర్థం. ప్లాస్టిక్ వేస్ట్ లాగా ప్రస్తుతం ఫ్యాషన్ వేస్ట్ కూడా ఒక సమస్య. అది తీవ్రతరం కాకముందే ఫ్యాషన్ వేస్ట్ ని తగ్గించే మార్గాలు తెలుసుకుందాం. హై క్వాలిటీ తక్కువ క్వాలిటీతో ఎక్కువ దుస్తులు కొనడం కన్నా ఎక్కువ క్వాలిటీతో బట్టలు కొనడం మంచిది. మార్కెట్లో దొరికే ప్రతి స్టైల్ దుస్తులను తక్కువ ధరల్లో ఎక్కువగా కొనడం వల్ల మీ బీరువా నిండిపోతుంది. అలాకాకుండా ఎప్పటికీ ట్రెండింగ్లో ఉండే హై క్వాలిటీ దుస్తులను తీసుకోవడం మంచిది.
ఫ్యాషన్ వేస్ట్ తగ్గించాలంటే చేయాల్సిన పనులు
పర్యావరణాన్ని సంరక్షించేలా దుస్తులు మీరు కొనుక్కునే దుస్తులు పర్యావరణ హితంగా ఉండాలి. ఎక్కువ కాలం మన్నేలా, రీసైకిల్ చేసే విధంగా ఉంటే బాగుంటుంది. బట్టలు కొనే ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవడం ఉత్తమం. నచ్చిన వెంటనే కొనడం తగ్గించాలి అనుకోకుండా షాప్ కి వెళ్లారు, అక్కడ నచ్చేసింది కదా అని బట్టలు కొనడం వల్ల మీరు పర్యావరణానికి నష్టం చేసిన వారవుతారు. అసలు మీరు కొనాలనుకునే బట్టలు మీకు నిజంగా అవసరమా? ఎందుకోసం కొనాలనుకుంటున్నారో తెలుసుకుని మాత్రమే కొనండి. వాడని బట్టలను దానం చేయండి మీ బీరువాలో మీరు చాలా రోజులుగా వేసుకోని జీన్స్, షర్ట్స్ ఉండి ఉంటాయి. వాటిని పక్కన పారేయకుండా ఎవరికైనా దానం చేయండి.