Page Loader
ఆహారం: పండ్లు తినేటపుడు చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టాలు 
పండ్లు తినేటపుడు చేయకూడని పొరపాట్లు

ఆహారం: పండ్లు తినేటపుడు చేసే పొరపాట్ల వల్ల కలిగే నష్టాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 04, 2023
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆరోగ్యకరమైన ఆహారం అనే మాట వచ్చినప్పుడు అందులో పండ్లు తప్పకుండా ఉంటాయి. పండ్లలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే పండ్లను తినేటప్పుడు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు. ప్రస్తుతం ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకుని పండ్ల ద్వారా వచ్చే ఆరోగ్యాన్ని అనుభవిద్దాం. రాత్రిపూట పండ్లు తినడం సరైన ఆలోచన కాదు రాత్రిపూట తేలికైన ఆహారం తినాలని చెబుతారు, నిజమే. అయితే పండ్లను తినడం వల్ల అందులోని సహజమైన చక్కెర మీలో శక్తి స్థాయిలను పెంచుతుంది. దానివల్ల మీకు తొందరగా నిద్ర రాదు. అందుకని రాత్రిపూట పనులు తినకపోవడమే మంచిది. ఒకవేళ తినాలనుకుంటే నిద్రపోయే మూడు గంటల ముందు మాత్రమే పండ్లను తినాలి.

Details

పండ్లు కోసుకుని అలానే వదిలేసే అలవాటును మానుకోవాలి 

జ్యూసులు తాగడం కరెక్ట్ కాదు పండ్లను జ్యూసులుగా చేసి తాగడం వల్ల వాటిలోని సహజ చక్కర, ఫైబర్ వంటివి తొలగిపోతాయి అదీగాక మీరు జ్యూస్ తాగినప్పుడు దాన్నుండి చక్కెరను ప్రాసెస్ చేయడానికి పాంక్రియాస్ పై ఒత్తిడి పడుతుంది. పండు కోసి చాలాసేపటి వరకు వదిలివేయడం పండు తిందామని కోసుకొని చాలా సేపటి వరకు అలానే వదిలివేయడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల పోషకాలు తొలగిపోతాయి. పండ్లు తినగానే నీళ్లు తాగకూడదు ఇలా చేయడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్, ఉబ్బరం వంటి ఇబ్బందులు వస్తాయి.అందుకే పండ్లు తిన్నాక 25 నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి.