Forget expensive AC: రూ.800 ఖర్చుతో ఇంట్లో చల్లదనం.. వైరల్ అవుతున్న సింపుల్ ట్రిక్
ఈ వార్తాకథనం ఏంటి
ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్ వేసుకున్నా వేడి గాలే వస్తోందని చాలామంది వాపోతున్నారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. కేవలం రూ.800 ఖర్చుతో ఇంటి పైకప్పు ఉష్ణోగ్రతను 15డిగ్రీల వరకు తగ్గించవచ్చని వీడియోలో పేర్కొనడం ఆసక్తి రేపుతోంది. వైరల్ అవుతున్న చిట్కా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి సింపుల్ టెక్నిక్‌ను వివరించాడు. ఫిక్సిట్ యూఆర్పీ,తెల్ల సున్నం పొడి,ఫెవికాల్ బైండర్‌ను కలిపి ప్రత్యేక కోటింగ్ తయారు చేసి ఇంటి పైకప్పుపై పూయాలని సూచించాడు. ఇలా చేయడం వల్ల ఎండ వేడి నేరుగా కాంక్రీట్‌లోకి చేరకుండా తగ్గుతుందని చెప్పాడు.
వివరాలు
ఎలా పనిచేస్తుందంటే..
ఈ పద్ధతి వెనుక ప్రధానంగా రిఫ్లెక్టివ్ టెక్నాలజీ ఉందని వీడియోలో వివరించారు. తెల్లటి కోటింగ్ సూర్యకిరణాలను తిరిగి ప్రతిఫలింపజేస్తుంది. దీంతో పైకప్పు వేడి తక్కువగా గ్రహిస్తుందని, ఇంట్లో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుందని అంటున్నారు. సాధారణంగా కాంక్రీట్ పైకప్పులు రోజంతా వేడిని గ్రహించి రాత్రివేళ కూడా వేడి విడుదల చేస్తుంటాయి. ఈ కోటింగ్ ఆ ప్రభావాన్ని తగ్గిస్తుందట. ఫెవికాల్ ఎందుకు? సాధారణంగా సున్నం పూస్తే వర్షం పడితే త్వరగా ఊడిపోతుంది. కానీ ఫెవికాల్ బైండర్ కలపడం వల్ల ఆ కోటింగ్ బలంగా అంటుకుని ఎక్కువకాలం నిలుస్తుందని అతను వీడియోలో చెప్పాడు. దీంతో వర్షాల సమయంలో కూడా కోటింగ్ సులభంగా తొలగిపోదని పేర్కొన్నాడు.
వివరాలు
ఏసీకి ప్రత్యామ్నాయమా?
ప్రస్తుతం ఏసీ కొనాలంటే వేలల్లో ఖర్చవుతోంది. అదనంగా భారీ విద్యుత్ బిల్లులు కూడా భారంగా మారుతున్నాయి.. ఈ పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో ఇంటిని చల్లగా ఉంచే మార్గమంటూ ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే వీడియోలో చెప్పినట్లు నిజంగా 15 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందా లేదా అన్నదానిపై నిపుణుల అభిప్రాయం ఇంకా తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎండలు మండుతున్నాయా?.. ఈ వైరల్ చిట్కాతో ఇంటిని కూల్‌గా మార్చుకోండి
"लोग AC पर 20-30 हजार खर्च कर रहे हैं...
— DINESH K SEN (@dks_230) May 27, 2026
ये भाईसाहब ने छत पर जो किया, उससे 15 डिग्री ठंडक फ्री में!😱 pic.twitter.com/6wBRbBoJ5I