ఒకే ఇంట్లో ఉండే 9మంది పుట్టినరోజులు ఒకటేరోజు కావడం ఎక్కడైనా చూసారా? అయితే ఇది చదవండి
ఈ వార్తాకథనం ఏంటి
ఒక ఫ్యామిలీలో ఇద్దరి పుట్టినరోజులు ఒకేరోజున వస్తేనే అదేదో వింతలా అనుకుంటారు. అలాంటిది ఒక ఫ్యామిలీలో ఉండే 9మంది ఒకేరోజున పుట్టారని తెలిస్తే ఎవ్వరైనా షాకవుతారు. కానీ ఇది నిజం.
పాకిస్తాన్ కు చెందిన మంగి కుటుంబంలోని మొత్తం 9మంది ఒకరోజున (ఆగస్టు 1) పుట్టారు. తల్లీ, తండ్రీ, ఏడుగురు పిల్లలు.. అందరూ ఆగస్టు 1వ తేదీన పుట్టారు.
ఇక్కడ ఇంకో విచిత్రం ఏమిటంటే, తల్లిదండ్రుల పెళ్ళిరోజు కూడా ఆగస్టు 1వ తేదీ కావడం విశేషం. పాకిస్తాన్ కు చెందిన అమీర్, కుదేజా 1991లో ఆగస్టు 1వ తేదీన పెళ్ళి చేసుకున్నారు.
ఒకే కుటుంబంలోని ఎక్కువ మంది ఒకేరోజున పుట్టినరోజు జరుపుకోవడం గిన్నిస్ రికార్డుగా మారింది.
Details
పుట్టినరోజుకు నో ప్లానింగ్
గతంలో ఒకే కుటుంబంలో నుండి ఎక్కువ మంది ఒకేరోజు పుట్టడం అనే రికార్డు అమెరికాకు చెందిన కమ్మిన్ ఫ్యామిలీ పేరు మీద ఉండేది. ఆయన ఫ్యామిలీలో ఐదుగురు పిల్లలు ఒకేరోజున పుట్టారు.
ఇప్పుడు ఆ రికార్డు, అమీర్, కుదేజాలు దక్కించుకున్నారు. 1992లో మొదటి బిడ్డ ఆగస్టు 1న జన్మించగానే వాళ్ళు షాకయ్యారట. తమ పుట్టినరోజు నాడు బిడ్డ జన్మించడం భగవంతుడు ఇచ్చిన బహుమానమని అంటున్నారు.
అయితే పిల్లలలందరూ సహజంగానే జన్మించారట. ఎలాంటి ప్లానింగ్ లేకుండానే అలా జరిగిందట. మొత్తం ఏడుగురు పిల్లల్లో రెండు కవల జంటలు ఉన్నాయి.
ఒకే మహిళకు రెండుసార్లు కవల జంటలు పుట్టడం అనేది కూడా అరుదుగా జరుగుతుందని గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ రాసుకొచ్చింది.