చలికాలంలో చల్లగా హిమక్రిములు లాగించేద్దాం
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో ఐస్ క్రీం తినాలని అనిపించడం సహజమే, అలా తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
చాలా మందికి రాత్రి భోజనం తర్వాత ఐస్ క్రీం తినడం అలవాటు. ఎక్కువమంది వాటిని వేసవిలో తినడానికి ఇష్టపడతారు. అయితే కొంతమంది వెరైటీగా చలికాలంలో ఐస్ క్రీం తినడానికి ఇష్టపడతారు.
వాతావరణం ఎలా ఉన్నా సరే, నోట్లో వేస్తే కరిగిపోయే ఐస్ క్రీం అంటే అందరికి ఇష్టమే. అయితే ఈ ఐస్ క్రీములు తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
గొంతు ఇన్ఫెక్షన్: జలుబు, దగ్గు కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే, ఐస్ క్రీం తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం పొందవచ్చు.
ఐస్ క్రీం
ఐస్ క్రీం తిన్న తర్వాత జలుబు చేస్తుందని అనుకుంటారు, కానీ నిజానికి ఐస్ క్రీమ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: పొద్దున్నే ఐస్ క్రీం తినడం వల్ల మెదడుకు ఎంతో మేలు జరుగుతుంది. ఐస్ క్రీం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ప్రోటీన్లు లభిస్తాయి: ఇతర పాల ఉత్పత్తుల లాగా, పాలతో చేసే ఐస్ క్రీంలో ప్రోటీన్లు ఉంటాయి. కండరాలు, చర్మం, ఎముకలు, రక్తం వంటి శరీరంలోని ప్రతి భాగానికి ప్రోటీన్ మేలు చేస్తుంది.
విటమిన్లు ఉంటాయి: ఐస్‌క్రీమ్‌లో విటమిన్ ఎ, బి-2, బి-12 ఉంటాయి. విటమిన్ ఎ చర్మం, ఎముకలు, రోగనిరోధక వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది.
ఐస్ క్రీంలో విటమిన్ ఎ, బి-2, బి-3 ఉంటాయి. విటమిన్ బి-2, బి-12 బరువు తగ్గడంలో సహాయపడతాయి.