
కుంకుడు కాయల వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
కుంకుడు కాయలు అనగానే మనందరికీ జుట్టు సంరక్షణ గుర్తుకొస్తుంది.
శిరోజాలను అందంగా, మృదువుగా, మెరిసేలా మార్చడంలో కుంకుడు కాయల రసం ఎంతగానో పనిచేస్తుంది. షాంపూలు లేని కాలంలో జుట్టును శుభ్రపరచుకోవడానికి దీన్ని ఉపయోగించేవారు.
జుట్టులోని మలినాన్ని దూరం చేసి వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచడంలో కుంకుడుకాయలు చాలా సహాయపడతాయి.
ప్రస్తుతం జుట్టుకు సంబంధించిన సంరక్షణ మాత్రమే కాకుండా కుంకుడు కాయలు చేసే ఇతర ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
చర్మ సంరక్షణలో కుంకుండు కాయ:
కుంకుడుకాయలు చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు కుంకుడుకాయలను వాడవచ్చు.
చర్మంపై ఉన్న మచ్చలు, బ్లాక్ హెడ్స్, మొటిమలు వంటి వాటిని తొలగించడంలో కుంకుడుకాయలు తోడ్పడతాయి.
Details
మగవాళ్ళకు పనికొచ్చే కుంకుడు కాయలు
క్రిమిసంహారిణిగా:
కుంకుడుకాయ మొక్కలకు సోకే తెగుళ్లను నివారించడంలో కుంకుడుకాయ సాయపడుతుంది. దీనికోసం, కుంకుడు కాయను పగలగొట్టి రసాన్ని తీసి నీటిలో కలిపి మొక్కలపై చల్లాలి.
అన్ని రకాల వస్తువులను శుభ్రం చేస్తుంది:
కుంకుడుకాయ రసాన్ని జంతువులకు స్నానం చేయించడానికి కూడా వాడతారు. అలాగే బంగారు ఆభరణాలు శుభ్రం చేయవచ్చు.
షేవింగ్ క్రీమ్:
గడ్డం తీసుకునే మగవారు కుంకుడుకాయ రసాన్ని షేవింగ్ క్రీమ్ లాగా ఉపయోగించవచ్చు. షేవింగ్ క్రీమ్ లోని రసయనాలు చర్మాన్ని పాడుచేస్తాయనుకుంటే కుంకుడు కాయలను ఉపయోగించవచ్చు.
అంతేకాదు, ఆస్తమా, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కుంకుడు కాయలు బాగా హెల్ప్ చేస్తాయి.