మీ పెదాలు ముదురు రంగులో ఉన్నాయా? ఈ ఇంటి చిట్కాలతో లేత రంగులోకి మార్చుకోండి
ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన చర్మ రంగు ఉన్నట్టే పెదాల రంగు కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే కొందరిలో పెదాలు ముదురు రంగులో ఉంటాయి. పొగ త్రాగడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, మెడిసిన్ ఎక్కువగా వాడటం మొదలగు కారణాల వల్ల పెదాలు ముదురు రంగులోకి మారిపోతాయి. ప్రస్తుతం పెదాల ముదురు రంగును లేత రంగులోకి మార్చే ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. తేనె, చక్కెర: తేనె, చక్కెర కలిపి తయారు చేసుకున్న స్క్రబ్ వల్ల చనిపోయిన చర్మకణాలు తొలగిపోయి చర్మానికి మెరుపు వస్తుంది. దీనికోసం మీరు, తేనె, చక్కెరను ఒకపాత్రలో వేసి పొయ్యి మీద కొద్దిసేపు వేడిచేసి, ఆ తర్వాత మిశ్రమాన్ని పెదాలకు రుద్దుకోవాలి. కాసేపయ్యాక గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది.
చర్మ సమస్యలను దూరం చేసే కలబంద
కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో చర్మాన్ని తేమగా చేసే పోషకాలు ఉన్నాయి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని పెదాలకు మర్దన చేసుకుని, పొడిబారేదాకా వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. దోసకాయ రసం: పెదాల రంగును మార్చే శక్తి దోసకాయ రసానికి ఉందా అనే సందేహం మీకు కలగవచ్చు. కానీ దోసకాయ రసాన్ని పెదాలకు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కలబంద: చర్మ సమస్యలను దూరం చేయడంలో కలబంద బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంతో పాటు చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. కలబంద రసాన్ని పెదాలకు మర్దన చేసుకుని కాసేపయ్యాక కడిగితే సరిపోతుంది.