Pumpkin Seeds For Hair :గుమ్మడి గింజలతో జుట్టు పెరుగుతుందోచ్.. ఎలా వాడాలో తెలుసా!
సహజంగా జట్టు పెరుగుదల కోసం కొన్ని చిట్కాలను పాటిస్తాం. అయితే కొన్ని రకాల విత్తనాలను కూడా వాడటం మంచిదేనని నిపుణులు చెబుతున్నారు. జట్టు పెరుగుదలకు గుమ్మడికాయ గింజలను ప్రయత్నిస్తే చాలా రకాల ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ గింజల్లో అవసరమైన పోషకాలు, విటమన్లు ఉండటంతో జట్టు పెరుగుదలకు సహాయపడతాయి. గుమ్మడి గింజలలో విటమిన్ ఎ, బి, సీ, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ కాపర్ వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభించనున్నాయి. దీంతో ఈ గింజలు జుట్టును పెంచడంతో పాటు, చుండ్రు, వెంట్రుకలు తెగిపోయే అవకాశాన్నితగ్గిస్తుంది. జింక్ నెత్తిమీద సెబమ్, నూనె ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సాయపడుతుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సాధ్యపడుతుంది.
హెయిర్ మాస్క్ కు కావాల్సిన పదార్థాలు ఇవే
గుమ్మడికాయ గింజల్లో ఉండే ఓమేగా-3 ప్యాటీ యాసిడ్‌లు జట్టును బలోపేతం చేయడంతో పాటు, జట్టు నిర్మాణాన్ని మెరుగుపరస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ స్కాల్ప్‌ను మాయిశ్చరైజ్ చేసి, డ్రైనెస్, ఇరిటేషన్‌ని నిర్మూలిస్తుంది.గుమ్మడికాయ గింజలను రుచికరమైన చిరుతిండిగా తినడం కూడా మంచిదే. గుమ్మడికాయ గింజల హెయిర్ మాస్క్‌కు కావాల్సిన పదార్థాలు.. గుమ్మడి గింజలు 1/2 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, 1/2 కప్పు పెరుగు గుమ్మడి గింజలను మిక్సీలో వేసి ఫేస్టుగా చేసుకోవాలి. పేస్ట్‌లా చేయడానికి పెరుగుతో కలపండి. అందులో తేనె, కొబ్బరి నూనె వేసి, అన్ని పదార్థాలను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జుట్టుకు అప్లై చేయాలి