Page Loader
Home Decor Tips: ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి!
ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి!

Home Decor Tips: ఇల్లు క్లాసీగా, రిచ్‍గా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 06, 2024
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇల్లు క్లాసీ, రిచ్ లుక్‌తో ఆకట్టుకునే విధంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఇంటిని సరిగా సర్దుకోకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే అది చీప్‌గా కనిపించవచ్చు. అందుకే, ఇంటి విషయంలో కొన్ని ముఖ్యమైన టిప్స్ పాటించడం అవసరం. ఈ టిప్స్ పాటించడం ద్వారా ఇల్లు క్లాసీగా, మరింత ఖరీదుగా కనిపించి, అందరినీ ఆకట్టుకుంటుంది. ఇది ఇంట్లో పాజిటివ్ వైబ్స్‌ని తీసుకొస్తుంది. ప్రధాన ద్వారం వద్ద మొక్కలు ఉంచడం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది ఇంటికి క్లాసీ లుక్ ఇచ్చే అంశంగా మారుతుంది. గుమ్మాన్ని స్టైలిష్‌గా ఉండే తీగ మొక్కలతో డెకరేట్ చేయవచ్చు.

వివరాలు 

 చెక్కతో చేసిన ఫర్నీచర్ ఖరీదైన లుక్ 

అలాగే, ఇంటి గుమ్మం వద్ద మొక్కలతో కూడిన స్టాండ్‌లు ఉంచడం, అందమైన మొక్కలతో సమీపంలో లాన్ ఏర్పాటుచేయడం చాలా మంచి ఆలోచన. ఇంట్లో ఇండోర్ మొక్కలను పెంచడం కూడా ఇంటికి మరింత క్లాసీ ఫీలింగ్‌ని ఇస్తుంది. మొక్కలు ఇంటికి ఖరీదైన, అందమైన లుక్ ఇస్తాయి. ఇంకొక ముఖ్యమైన అంశం చెక్క ఫర్నీచర్. చెక్కతో చేసిన ఫర్నీచర్ ఖరీదైన లుక్ ఇస్తుంది. ప్లాస్టిక్ లేదా స్టీల్‌ ఫర్నీచర్‌లు అంత ఉత్కృష్టమైన, రిచ్‌ లుక్ ఇవ్వవు. అందుకే, ఇంట్లో ఎక్కువ శాతం చెక్క ఫర్నీచర్‌ వాడటం మంచిది. ఇవి క్లాసీ లుక్‌ని కలిగిస్తాయి. వాటిని మీకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవచ్చు, దీనివల్ల అవి మరింత ఆకర్షణీయంగా మారతాయి.

వివరాలు 

ఇంట్లో అద్దాలు, షాండిలేయర్స్ కూడా రిచ్ లుక్ ఇస్తాయి 

ఇంట్లో ఇంతటి ఖరీదైన వస్తువులు ఉన్నా సరిగా సర్దుకోకపోతే లుక్ బాగుండదు. ఏది ఎక్కడ ఉంచాలో ఎప్పుడూ ఆక్కడే పెట్టాలి. గందరగోళం ఉన్నప్పుడు వస్తువుల విలువ కూడా తగ్గిపోతుంది. కిచెన్ నుండి, పిల్లల బొమ్మల వరకూ ప్రతి వస్తువును దాని స్థలంలో ఉంచటం ముఖ్యం. ఇది ఇంటిని క్లీన్‌గా, క్లాసీగా చూపిస్తుంది. ఇంట్లో అద్దాలు, షాండిలేయర్స్ కూడా రిచ్ లుక్ ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. గోడలపై డిజైన్‌తో కూడిన అద్దాలు ఉంచడం, కిటికీల వద్ద మిర్రర్స్ ఉంటే ఇంటికి క్లాసీ ఫీల్ వస్తుంది. పైకప్పులో గాజు షాండిలేయర్ ఉండడం కూడా ఇంటి లుక్‌ను మరింత రిచ్‌గా చేస్తుంది. ఇంట్లో పెయింటింగ్స్ పెట్టుకోవడం కూడా రిచ్ లుక్ ఇచ్చే మంచి మార్గం.

వివరాలు 

ఇంట్లో సరైన లైటింగ్ ఉంటే, ఇలు ప్రకాశవంతంగా ఉంటుంది 

మంచి డిజైన్‌తో ఉన్న పెయింటింగ్స్ ఇంటి అలంకరణను ప్రాధాన్యతనిచ్చేలా మారుస్తాయి. ఈ పెయింటింగ్స్ మీ వ్యక్తిగత అభిరుచిని కూడా తెలియజేస్తాయి. ఇంట్లో సరైన లైటింగ్ ఉంటే, అది ఇంటిని ఎప్పటికప్పుడు ప్రకాశవంతంగా చూపిస్తుంది. చీకటి, మబ్బుగా ఉన్న సమయాలలో ఇంటి లుక్ చీప్‌గా కనిపించవచ్చు. కాబట్టి, లైటింగ్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యంగా లేకుండా, ఇంటికి సరిపోయే శ్రేష్టమైన లైటింగ్ సెట్ చేయడం అవసరం. అంతేకాకుండా, ఇంటి కిచెన్, బూత్రూమ్‌లలో ఉన్న హార్డ్‌వేర్ వస్తువులు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండాలి. లేటెస్ట్ డిజైన్, ఫీచర్లతో ఈ వస్తువులు ఇంటి రిచ్‌నెస్‌ని పెంచి, లుక్‌ను క్లాసీగా మార్చుతాయి.