LOADING...
Upma: ఉప్మా అంటే చిరాకా.. ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు తింటే వదలరు
ఉప్మా అంటే చిరాకా.. ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు తింటే వదలరు

Upma: ఉప్మా అంటే చిరాకా.. ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు తింటే వదలరు

వ్రాసిన వారు Stalin
May 19, 2024
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇళ్లలో చిన్నపిల్లలైతే ఉప్మా అంటే అదోలా మొహం పెడతారు. ఇక పెద్దవారైతే ఉప్మానా అంటూ రాగం తీస్తారు. ఉప్మా అంటేనే తేలికగా తక్కువ సమయంలో తయారయ్యే ఇన్ స్టెంట్ టిఫిన్ .ఈ రోజు కూడా కొందరి ఇళ్లలో ఉప్మానే అల్పాహారం కావచ్చు. ప్రతి ఇంట్లో ఉండే గోలే ఇది. అవును మరి. ఉప్మా అంటే ఆ రేంజ్‌లో వచ్చేస్తుంది విరక్తి. ఆ పేరు చెబితేనే పెదవి విరిచేస్తారు చాలా మంది. వండడం సింపులే అయినా తినడమే కష్టం. ఇంతకీ ఉప్మాపై ఎందుకింత కోపం..? అసలు ఈ టిఫిన్‌ ఎందుకు నచ్చదు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తే ఎప్పుడో బ్రిటీష్‌ కాలం నాటి రోజుల్లో తేలతాం.

Details 

ఉప్మా కథ ఇది..

అంతే కాదు. ఉప్మా కేవలం అల్పాహారం మాత్రమే కాదు. దాని చుట్టూ ఎన్నో రాజకీయాలున్నాయి. మరెన్నో ఆర్థిక కోణాలూ ఉన్నాయి. చెప్పాలంటే అందులో మన బానిసత్వం కనిపిస్తుంది. కాస్తంత అతిశయోక్తి అనిపించినా అసలు కథ తెలిస్తే అదంతా నిజమే అని అర్థమవుతుంది. Upma అనే పేరు uppu mavu అనే తమిళ పదాల నుంచి పుట్టింది. అంటే ఉప్పగా ఉండే పిండి అని అర్థం. పిండిలో నీళ్లు పోసి కాస్తంత ఉప్పు వేసుకుని వండుకునే వాళ్లు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

Details 

 బర్మా నుంచి దిగుమతి 

కర్ణాటకలో ఉప్పిట్టు అని, ఆంధ్రప్రదేశ్‌లో ఉప్పుడు పిండి అని కూడా పిలుస్తారు. 18వ శతాబ్దంలోనే మనకి ఈ వంటకం (Rava Upma) పరిచయం అయింది. ఈ ఉప్మా పుట్టుక వెనక పెద్ద చరిత్రే ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని బియ్యం నిల్వలన్నింటినీ బ్రిటీష్‌ వాళ్లు తమ సైనికుల కోసం ఎగుమతి చేసుకున్నారు. ఫలితంగా సౌత్‌లో బియ్యం దొరక్కుండా పోయింది. ఈ సమస్యని తీర్చేందుకు అప్పటికప్పుడు బర్మా నుంచి దిగుమతి చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బర్మాపై జపాన్‌ దాడి చేసింది. ఫలితంగా రైస్ ఇంపోర్ట్‌ ఒక్కసారిగా ఆగిపోయింది. రెస్టారెంట్‌లు అన్నీ మూతపడ్డాయి. అప్పుడే బ్రిటీష్‌ పాలకులు చాలా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు.

Details 

చెత్త నుంచి పుట్టిన టిఫిన్.. 

సౌత్ ఇండియన్స్‌ని ఎలాగైనా కన్విన్స్‌ చేయాలని పంజాబ్ నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవాలని చూసింది. కానీ ఇక్కడ ఓ సమస్య వచ్చి పడింది.గోధుమలను తీసుకొచ్చినా వాటిని పిండి పట్టించి చపాతీలు చేసుకునేందుకు స్థోమత అప్పట్లో దక్షిణాది ప్రజలకు లేకుండా పోయింది. సింపుల్‌గా వండుకునేలా ఏముంటుందని ఆలోచిస్తే ఫ్లోర్‌ మిల్లుల్లో(How Upma is Invented)పిండి పట్టగా మిగిలిపోయిన రవ్వపై వాళ్ల దృష్టి పడింది. ఓ రకంగా అది చెత్త లాంటిదే.కాకపోతే వండుకోడానికి సులువుగా ఉంటుందని పెద్ద ఎత్తున దిగుమతి చేసుకున్నారు. పైగా ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రచారం చేశారు. ఆకలి నుంచి బయటపడాలంటే ఇదే మంచిదంటూ ఊదరగొట్టారు. అంతే కాదు. ఈ రవ్వని ఎలా వండుకోవాలో ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇచ్చారు.

Details 

రవ్వ ఇడ్లీని పరిచయం చేసిన  MTR  అధినేత 

రెస్టారెంట్‌లకూ సప్లై చేశారు. అలా క్రమంగా అందరికీ ఈ ఉప్మాని అలవాటు చేశారు. అప్పటికి అందరికీ అదే పంచభక్ష్య పరమాన్నమైపోయింది. అప్పట్లో MTR (Mavalli Tiffin Room) అధినేత యజ్ఞనారాయణ మయ్యా రవ్వ ఇడ్లీని పరిచయం చేశారు. మద్రాస్ రెసిడెన్సీలో రెస్టారెంట్‌లలో పొంగల్‌కి బదులుగా అప్పటి నుంచి రవ్వ ఇడ్లీ సర్వ్ చేయడం మొదలు పెట్టారు. అది కాస్తా ఫేమస్ అయిపోయింది. అలా మొదలైన ఈ ఉప్మా ప్రస్థానం ఇక్కడి వరకూ వచ్చింది.

Details 

ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు టేస్ట్ చేస్తే కలిగే మజాయే సూపర్బ్ 

రకరకాల ఉప్మాల రెసెపీలు ఇప్పుడు వచ్చేసినా ఎక్కడో మనలో తెలియకుండానే దానిపై విరక్తి వచ్చేసింది. ఎంత స్పైసీగా చేసుకున్నా మసాలా తగలదు కాబట్టి చప్పటి తిండిగానే మిగిలిపోయింది. నచ్చినా నచ్చకపోయినా తిన్నా తినకపోయినా ఇప్పటికీ కిచెన్‌ని రూల్ చేసేస్తోంది ఉప్మా. అయితే ఉప్మాలో ఘాటైన సాంబార్ కారం పొడి లా చల్లుకుని తింటే ఆ టేస్ట్ వేరు . అలాగే ఉప్మా పెసరట్టు, M.L.A పెసరట్టు గురించి రాసినది చదివే కంటే ఓ సారి టేస్ట్ చేస్తే కలిగే మజా వేరు.