
Sabarimala Gold Dispute: శబరిమల బంగారు తాపడం వివాదం.. ఈ కేసులో కీలక మలుపు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బంగారం తాపడం వివాదంలో, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మధ్యంతర నివేదికను కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా, బంగారం మాయం కేసులో మరో కేసు నమోదు చేసే అవకాశాన్ని సిట్ పరిశీలిస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా 10 మంది నిందితులను విచారించనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ను సిట్ అరెస్ట్ చేసింది. అయితే, ఉన్నికృష్ణన్ తనను ట్రాప్ చేశారని ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సిట్ ఎస్పీ శశిధరన్ సీల్డ్ కవర్‌లో మధ్యంతర నివేదికను హైకోర్టుకు సమర్పించారు.
Details
445 గ్రాముల బంగారం మాయం
హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ బంగారం మాయం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ట్రావెన్‌కోర్ట్ బోర్డు మాజీ సభ్యులపై కూడా సిట్ కేసు నమోదు చేసింది. 2019లో బోర్డు సభ్యులుగా ఉన్నవారి పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారం శబరిమల ఆలయం నుంచి 445 గ్రాముల బంగారం మాయం కావడం వల్ల సంచలనంగా మారింది. గర్భగుడి బయట బంగారు ఫలకాలకు తాపం చేసిన ఉన్నికృష్ణన్‌కు స్థిరమైన ఆదాయం లేనట్టుగా గుర్తించారు. శబరిమల బంగారం మాయంపై హైకోర్టులో ఇన్‌కెమెరా విచారణ జరుగుతోంది. ఎలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయరాదని మీడియా సంస్థలకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.