LOADING...
Google: గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడద.. ఉద్యోగులకు తక్షణమే వర్క్‌ ఫ్రమ్ హోమ్
గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడద.. ఉద్యోగులకు తక్షణమే వర్క్‌ ఫ్రమ్ హోమ్

Google: గూగుల్ కార్యాలయంలో నల్లుల బెడద.. ఉద్యోగులకు తక్షణమే వర్క్‌ ఫ్రమ్ హోమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 21, 2025
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ దిగ్గజం గూగుల్‌కు న్యూయార్క్‌లోని ఆఫీసులో అనూహ్య సమస్య ఎదురైంది. న్యూయార్క్‌ సిటీ చెల్సియా క్యాంపస్‌లో బెడ్‌ బగ్స్‌ (నల్లులు) వ్యాపించినందున, ఆఫీసు సిబ్బందికి తాత్కాలికంగా వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ అనుమతించారు. పేజ్‌ సిక్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం, అక్టోబర్‌ 19, 20 తేదీల్లో గూగుల్‌ పర్యావరణ, ఆరోగ్య, భద్రత విభాగం ఇంటర్నల్‌ ఈ-మెయిల్స్‌ ద్వారా ఉద్యోగులకు సమస్య గురించి వివరాలు పంపింది. ఈ ఇ-మెయిల్స్‌ పరిశీలించిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.

Details

ఇదేమీ మొదటిసారి కాదు

చెల్సియా ఆఫీసుని ఆదివారం మూసివేసి, నల్లులు, ఇతర పురుగుల నియంత్రణ చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం నుంచి ఆఫీసులోని సిబ్బందిని తిరిగి పనికి అనుమతించారు. నల్లుల వ్యాప్తిని నివారించడానికి గూగుల్‌ హడ్సన్‌ స్క్వేర్‌ క్యాంపస్‌ సహా న్యూయార్క్‌లోని ఇతర ఆఫీసులలో కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. గూగుల్‌ ఆఫీసుల్లో బెడ్ బగ్స్‌ వ్యాప్తి ఇదే మొదటి సారి కాదు. 2010లో అవెన్యూ-9 ఆఫీసులో కూడా ఇలాగే సమస్య ఏర్పడింది. అయితే, న్యూయార్క్‌ సిటీలో ఈ సమస్యను తగ్గించడంలో అధికారులు కొంత పురోగతి సాధించారు. ఆఫీసులోని పెద్ద బొమ్మలలో బెడ్ బగ్స్ ఉండవచ్చని, అక్కడి నుంచి వ్యాప్తి అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Details

పూర్తిస్థాయిలో పరిశుభ్రత కరువు

నల్లులు వ్యాప్తికి కారణాలు కూడా ఉన్నాయి. అధిక జనసాంద్రత, పర్యాటకుల తాకిడి, పూర్తిస్థాయిలో పరిశుభ్రత లేకపోవడం వలన బెడ్ బగ్స్ వేగంగా వ్యాపిస్తున్నాయి. పరిశోధనల ప్రకారం, న్యూయార్క్‌లో నెలకు సగటున 5,680 బెడ్ బగ్‌ సంబంధిత ఆన్‌లైన్ సెర్చ్‌లు జరుగుతున్నాయి. బెడ్ బగ్స్‌ను పూర్తిగా నిర్మూలించడం కష్టం. ఇవి మానవ వాతావరణంలో సులభంగా విస్తరిస్తాయి. బట్టలు, లగేజీ, ఫర్నీచర్‌ ద్వారా ఒకచోటు నుంచి మరో చోటుకు వెళ్తాయి.