
BCCI: ట్రోఫీ ఇస్తున్నందుకు నిరాకరించిన నఖ్వీ.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా ఆసియా కప్ (Asia Cup)విజేతగా నిలిచినప్పటికి 20 రోజుల తర్వాత కూడా ట్రోఫీ, మెడల్స్ భారత జట్టుకు చేరలేదు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఏసీసీ చీఫ్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(PCB) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్స్ తీసుకెళ్ళడాన్ని భారత క్రికెటర్లు నిరాకరించారు. ఫలితంగా ట్రోఫీ, మెడల్స్‌ను నఖ్వీ తనతోపాటు తీసుకెళ్లిపోయారు. బీసీసీఐ ఆసియా కప్ ఫైనల్ ముగిసిన రెండ్రోజులలోనే, నఖ్వీ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా నఖ్వీకి బోర్డు గట్టి వార్నింగ్ జారీ చేసింది. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్‌కు అప్పగించమని, లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేయబోతున్నామని అధికారిక ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించింది.
Details
మెయిల్ ద్వారా ఐసీసీకి తెలియజేస్తాం
బోర్డు కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా ప్రకారం, ఏసీసీ చీఫ్ నుంచి ప్రతిస్పందన కోసం వేచి ఉన్నామని, ఎటువంటి స్పందన రాకపోతే అధికారిక మెయిల్ ద్వారా ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియలో దశలవారీగా ముందుకు సాగుతున్నట్లు, ట్రోఫీని భారత్‌కు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. తాజాగా, నఖ్వీ ఇప్పటికే ఏసీసీ కార్యాలయంలో భారత జట్టుకు ట్రోఫీ అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ స్పష్టంగా తెలిపింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ట్రోఫీని స్వీకరించేది నఖ్వీ చేతుల్లోనే ఉంటుందని. ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. నఖ్వీ తన అనుమతి లేకుండా దాన్ని తరలించడం లేదా ఇతరులకు అప్పగించరాదని అధికారులు తెలిపారు.