Holi Color Stains: బట్టలకు,ముఖానికి ఉన్నహోలీ మరకలు తొలగించడానికి.. ఇలా చేయండి!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా హోలీ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. చిన్నా పెద్దా అనే భేదం లేకుండా రంగులతో ఆడుకుంటూ కలసి ఆనందిస్తారు.
అయితే, కెమికల్స్ కలిగిన రంగులను వాడటానికి బదులుగా సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రసాయనాలతో కూడిన రంగులు చర్మంపై దద్దుర్లు, ఎర్రదనం, మచ్చలు వంటి సమస్యలను కలిగించవచ్చు.
అంతేకాదు, ఈ రంగులను శరీరం నుంచి తొలగించడం కూడా చాలా కష్టమే. అందుకే, సహజ రంగులను ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు.
అలాగే, హోలీ రంగుల వల్ల బట్టలకు కూడా మరకలు ఏర్పడతాయి. ఈ మరకలను తొలగించడం చాలా కష్టమైన పని. అయితే, కొన్ని సరళమైన ఇంటి చిట్కాలను అనుసరిస్తే ఈజీగా పోగొట్టుకోవచ్చు.
వివరాలు
హోలీ రంగులను తొలగించే ఉపాయాలు
1. ఆయిల్ మసాజ్: హోలీ ఆడిన వెంటనే నీటితో కడగకుండా, ముందుగా కొంత ఆయిల్ (కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె) తీసుకుని శరీరంపై మర్దన చేయండి. ఇది చర్మానికి అంటుకున్న రంగులను తేలిగ్గా వదిలిస్తుంది.
2. బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌గా తయారు చేసి, రంగులు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి కొద్దిసేపు వదిలేయండి. ఆపై నీటితో కడిగితే రంగులు త్వరగా పోతాయి.
3. వెనిగర్: బట్టలకు పట్టిన హోలీ మరకలను తొలగించడానికి వెనిగర్ చాలా ఉపయోగపడుతుంది. రెండు గంటల పాటు వెనిగర్ నీటిలో బట్టలను నానబెట్టి, ఆపై సాధారణంగా ఉతికితే మరకలు సులభంగా తొలగిపోతాయి.
వివరాలు
హోలీ రంగులను తొలగించే ఉపాయాలు
4. నిమ్మరసం,రాతి ఉప్పు: చర్మంపై రంగులను తొలగించడానికి నిమ్మరసం మరియు రాతి ఉప్పు కలిపి అప్లై చేయండి. ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత నీటితో కడిగేయండి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కెమికల్ మరకలను సమర్థంగా తొలగిస్తుంది.
ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల హోలీ రంగులను తేలికగా వదిలించుకోవచ్చు.