Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మధ్య తేడా ఏంటి..? అసలు నిజాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం.. రెండూ జాతీయ పండుగలే. కానీ ఈ రెండు రోజులకు ఉన్న ప్రాధాన్యత, చరిత్ర మాత్రం వేరు. అసలు ఈ రెండు పండుగల మధ్య తేడా ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? తెలుసుకుందాం. ప్రతి ఏడాది ఆగస్టు 15న దేశ ప్రజలంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా ఈ రోజును నిర్వహిస్తారు. ఈ రోజున దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని జాతీయ జెండాను ఎగురవేసి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశవ్యాప్తంగా కూడా జాతీయ జెండాలను ఎగురవేసి వేడుకలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుని.. దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు.
వివనాలు
గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి..?
ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున కూడా దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగురవేసి వేడుకలు నిర్వహిస్తారు.
అయితే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రెండింటి ఉద్దేశం వేరు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం లభించింది.
ఆ తర్వాత భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది.
అనంతరం 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
అంటే.. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజును గుర్తు చేసుకుంటే.. జనవరి 26న దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును జరుపుకుంటాం.
వివరాలు
రెండు రోజులకు మధ్య ప్రధాన తేడా ఇదే..
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే ప్రత్యేక పరేడ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
కర్తవ్య పథ్‌లో జరిగే ఈ పరేడ్‌లో భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తాయి.
వైమానిక విన్యాసాలతో పాటు దేశ సాంస్కృతిక, సామాజిక వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు.
ఇక ఆగస్టు 15న దేశవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, పరేడ్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వివరాలు
రెండు రోజులు భారతీయులకు ఎంతో ప్రత్యేకం..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బ్రిటిష్ పాలన నుంచి భారత్‌కు విముక్తి లభించిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గుర్తు చేసుకుంటాం.
అందుకే ఆగస్టు 15, జనవరి 26.. ఈ రెండు రోజులు భారతీయులకు ఎంతో ప్రత్యేకమైనవి.
ఒకటి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజుకు గుర్తుగా జరుపుకునే పండుగ కాగా.. మరొకటి దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా జరుపుకునే జాతీయ పండుగ.