
ఇంటర్నేషనల్ చాక్లెట్ డే: చాక్లెట్ ఇష్టపడేవారు తప్పక చూడాల్సిన ప్రదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ప్రపంచంలో చాక్లెట్ ని ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. చాక్లెట్ ని మొదటిసారిగా 4వేల సంవత్సరాల క్రితమే తయారు చేసారని చెబుతారు. ఈరోజు చాక్లెట్ డే. ఈ సందర్భంగా చాక్లెట్ ని ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన కొన్ని ప్రదేశాలు ఏంటో చూద్దాం.
క్యాడ్ బరీ వరల్డ్ - బర్మింగ్ హామ్(ఇంగ్లాండ్):
1990లో క్యాడ్ బరీ వరల్డ్ ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో చాక్లెట్ థీమ్ జోన్స్, చాక్లెట్ చరిత్రను తెలియజేసే విషయాలను మీరు చూడవచ్చు.
చాకోవర్సమ్ - హాంబర్గ్(జర్మనీ):
ఇక్కడ ఉండే చాకోవర్సమ్ అనే ప్రదేశాన్ని 1890లో హాచెజ్ కంపెనీ నిర్మించింది. ఈ ప్రదేశంలో 90నిమిషాలు తిరగవచ్చు. కోకో పౌడర్ నుండి లిక్విడ్ చాక్లెట్ వరకూ అన్నింటిని టేస్ట్ చేయవచ్చు.
Details
ఆసక్తిగా అనిపించే చాక్లెట్ మ్యూజియం
లోకల్ చాక్లెట్ బొటిక్స్ - ప్యారిస్(ఫ్రాన్స్):
ప్యారిస్ లో చాక్లెట్ స్టోర్స్ ఎన్నో ఉంటాయి. వివిధ రకాలైన చాక్లెట్స్ ని వేరు వేరు ఆకారాల్లో తయారు చేసి అందిస్తారు.
మూచో మ్యూజియో డెల్ చాక్లెట్ - మెక్సికో సిటీ(మెక్సికో):
మెక్సికో లోని ఈ ప్రదేశం 2012లో ప్రారంభమైంది. దీన్ని చాక్లెట్ మ్యూజియంగా పిలుస్తారు. ఇక్కడ 17వ శతాబ్ద కాలం నాటి చాక్లెట్ హిస్టరీని తెలుసుకోవచ్చు.
లిండిట్ హ్యోమ్ ఆఫ్ చాక్లెట్ - జ్యూరిచ్(స్విట్జర్ ల్యాండ్):
మీరు జ్యూరిచ్ పర్యటనకు లిండిట్ హోమ్ ఆఫ్ జ్యూరిచ్ ని తప్పక సందర్శించండి. కోకో పంటను ఎప్పుడు పండించారనే దాని గురించి చాక్లెట్స్ లో వెరైటీలను ఎలా తయారు చేయాలో కూడా ఇక్కడ చెబుతారు.