వరల్డ్ చాకోలెట్ డే 2023: ఈరోజును ఏ విధంగా సెలెబ్రేట్ చేసుకోవాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టమే. చిన్నపిల్లల దగ్గరి నుండి పెద్దల వరకూ ప్రతీ ఒక్కరూ చాక్లెట్లను ఇష్టపడతారు.
పుట్టినరోజు, పెళ్ళిరోజు ఇలా ఏ సందర్భాన్ని జరుపుకునే సమయంలోనైనా చాక్లెట్లను పంచడం అందరికీ అలవాటుగా మారిపోయింది.
ఈరోజు వరల్డ్ చాకోలెట్ డే. ఈ సందర్భంగా చాకోలెట్ చరిత్ర తెలుసుకుని ఈరోజును ఏ విధంగా సెలెబ్రేట్ చేసుకోవాలో చూద్దాం.
1550లో యూరప్ దేశాల ప్రజలు మొదటిసారిగా జులై 7వ తేదీన చాకోలెట్ తయారు చేసారని నమ్ముతారు. అందుకే జులై 7న వరల్డ్ చాకోలెట్ డే జరుపుకుంటారు.
చాకోలెట్ తయారు కావడానికి కారణమైన కోకోబీన్స్ ని మొదటిసారిగా సెంట్రల్ అమెరికాలో క్రీస్తు పూర్వం 2000సంవత్సరంలో పండించారని చరిత్ర చెబుతోంది.
Details
చాకోలేట్ డే ని ఎలా సెలెబ్రేట్ చేసుకోవాలంటే?
చాకోలెట్స్ లో కొత్త రకాల ఫ్లేవర్స్ ని ప్రయత్నించండి. క్యారమెల్, సీ సాల్ట్, నట్స్ వంటివి టేస్ట్ చేయండి.
మీరు ఇంట్లోనే ఉంటే చాకోలెట్స్ ని తయారు చేయండి. బ్రౌనీస్, కేక్స్, కుకీస్, చాకోలెట్ స్ట్రాబెర్రీస్ ని ఈజీగా తయారు చేయవచ్చు.
వివిధ రకాల చాకోలెట్స్ తో మీ ఇంట్లో పార్టీ అరేంజ్ చేయండి. ముఖ్యంగా పిల్లల కోసం రకరకాల చాకోలెట్స్ తీసుకురండి.
మీకు నచ్చిన వారికి, మీ భాగస్వామికి చాకోలెట్ బహుమతులు ఇవ్వండి. రేర్ చాకోలెట్స్ మార్కెట్లో దొరుకుతాయి.
చాక్లెట్స్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. చాక్లెట్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కారణంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్లడ్ ప్రెష తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.