Periods Postpone : పీరియడ్స్ ఆపడానికి ట్యాబ్లెట్స్ వాడటం ప్రమాదకరమా..?
అమ్మాయిల ఓ వయసుకు వచ్చేసరికి నెలనెలా పీరియడ్స్ వస్తుంటాయి. సాధారాణంగా అమ్మాయిల్లో 28 నుంచి 38 రోజుల్లోగా పీరియడ్స్ వస్తాయి. రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవారు అదే సమయంలో ఏదైనా ఫంక్షన్, పూజలు ఉంటే వాటిని ఆపడానికి మాత్రలు వేసుకుంటారు. నిజానికి ఆ మాత్రలు వేసుకోవడం మంచిదో కాదో తెలుసుకుందాం. పీరియడ్స్ పోస్ట్ పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్లు రక్తంలోనే ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్న ప్రతిసారి, రక్తంలో హార్మోన్ల చక్రం పెరుగుంది. పీరియడ్స్ లేట్ అయితే రొమ్ముల్లో నొప్పి, నడుము నొప్పులు ఎక్కువ అవుతాయి.
పీరియడ్స్ ను పోస్ట్ పోన్ చేస్తే ఫెర్టిలిటీ సమస్యలు
ఇక పీరియడ్స్ ని ఆపుకోవడానికి సహజమైన పద్ధతులను ఫాలో అవ్వొచ్చు. దీని వల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ట్యాబ్లెట్స్ కంటే ఇది మంచి పద్ధతి అని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్ ని పోస్టు పోన్ చేసుకుంటే ఇన్ ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే ప్రమాదముంది. కావున సహజంగానూ, ట్యాబ్లెట్స్ వాడి సమస్యను పెంచుకోకపోవడం మంచిది. కొన్నిసార్లు సహజంగానూ పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేయకపోవడం కూడా మంచిదే. శరీర విధుల ప్రకారం సహజ ప్రసరణ వ్యవస్థని అలానే ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఒకవేళ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటే డాక్టర్ ని కన్సల్ట్ కావాలి