
జపాన్ వెళ్తే బట్టలు అవసరం లేకుండా రెంటల్ క్లాత్స్ ని పరిచయం చేస్తున్న జపాన్ ఎయిర్ లైన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఏదైనా ప్రాంతానికి పర్యటన కోసం వెళ్ళాలనుకుంటే బట్టలు సర్దుకోవడం పెద్ద టాస్కులాగా అనిపిస్తుంటుంది. ఆ బరువు మోయడం చిరాగ్గా ఉంటుంది.
ఈ ఇబ్బందిని తీర్చడానికి జపాన్ ఎయిర్ లైన్స్ సరికొత కాన్సెప్ట్ తో వచ్చింది.
ఇకపై జపాన్ వెళ్ళాలనుకునే వారు బట్టలు సర్దుకోవాల్సిన అవసరం లేదు. మీక్కావాల్సిన బట్టలను జపాన్ లో అద్దెకు తీసుకునే అవకాశాన్ని జపాన్ ఎయిర్ లైన్స్ కల్పిస్తుంది.
విమానంలో బట్టల బరువును తగ్గిస్తే విడుదలయ్యే కర్బన్ రసాయనాలు తగ్గుతాయని, దానివల్ల పర్యావరణానికి హాని తగ్గించిన వాళ్ళమవుతామని ఇలాంటి కాన్సెప్టును తీసుకొచ్చింది.
బట్టలు లేకపోవడం వలన ఒక కిలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదల తగ్గిపోతుందని జపాన్ ఎయిర్ లైన్స్ చెబుతోంది.
Details
బట్టలను రెంట్ కి తీసుకునే ప్రాసెస్ ఏంటంటే?
బట్టలను రెంట్ కి తీసుకోవడం కోసం www.Anywearanywhere.store అనే వెబ్ సైటును ఓపెన్ చేసింది.
ఈ సైటుకు వెళ్ళిన తర్వాత రిజర్వేషన్ పేజీకి చేరుకుని అక్కడ మీకు కనిపించే బట్టల్లో ఎలాంటి బట్టలు కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో క్యాజువల్స్, ఆఫీస్ వేర్స్, జపాన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి.
బట్టలను సెలెక్ట్ చేసుకుని జపాన్ ఎయిర్ లైన్స్ బుకింగ్ నెంబర్, మీరు ఎప్పుడు బట్టలు తీసుకుంటారు అనే సమాచారాన్ని ఇచ్చి డబ్బులు చెల్లించాలి.
నెలరోజుల ముందుగానే సైట్ లోకి ప్రవేశించి ఆర్డర్ చేయాలి. ఈ సైట్ లో పదిహేను రోజుల వరకు బట్టలను అద్దెకు తీసుకోవచ్చు.