ట్రావెల్: లోక్ తక్ సరస్సు నుండి కేయాంగ్ పర్వతం వరకు మణిపూర్ లో చూడాల్సిన ప్రదేశాలు
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. సుందరమైన మైదానాల నుండి, అబ్బురగొలిపే సరస్సుల వరకూ అన్నీ చూడవచ్చు. అంతేకాదు మనిపూర్ నృత్యం, సంస్కృతి, కళలు, సాంప్రాదాయాలు ఆసక్తిగా ఉంటాయి. మణిపూర్ చుట్టూ 9పర్వతాలు ఉంటాయి. మధ్యలో గుడ్డు ఆకారంలో లోయ ఉంటుంది. అందుకే మణిపూర్ ని భారతదేశ ఆభరణం అని పిలుస్తారు. మణిపూర్ లో చూడాల్సిన ప్రదేశాలు లోక్ తక్ సరస్సు: ఈశాన్య రాష్ట్రాల్లోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఇదే. దాదాపు 240 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ సరస్సు ఉంటుంది. నవంబరు నుండి ఫిబ్రవరి మధ్యకాలంలో సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ సరస్సులో నీటిమీద తేలియాడే ద్వీపాలు కనిపిస్తాయి.
సాహస క్రీడలకు అనువైన ప్రదేశం
కేయాంగ్ పర్వతం: సముద్ర మట్టం నుండి 3,114మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతం చుట్టూ అనేక లోయలు, సరస్సలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో సాహస క్రీడలు ఆడవచ్చు. ట్రెక్కింగ్ చేయవచ్చు. కంగ్లా కోట: ఈ కోట, మణిపూర్ చరిత్రను తెలియజేస్తుంది. మణిపూర్ ని పాలించిన రాజులు, 1891వరకు ఈ కోటలోనే నివసించారు. మణిపూర్ రాజధాని ఇంఫాలో లో ఈ కోట ఉంది. ఈ కోటలో విక్టోరియా మ్యూజియం, గోవిందాజీ గుడి ఉంటాయి. కేబుల్ లాంజావో నేషనల్ పార్క్: వన్యమృగాలను చూడాలన్న ఆసక్తి ఉన్నవారు ఈ పార్క్ ని సందర్శించవచ్చు. సంగై జింకలకు నివాస కేంద్రమైన ఈ ప్రాంతంలో రకరకాల జింకలను, వలస పక్షులను చూడవచ్చు.