బహ్రెయిన్ నుండి మీ ఇంటికి గుర్తుగా తెచ్చుకోవాల్సిన వస్తువులు
పర్యాటకంలో భాగంగా మిడిల్ ఈస్ట్ దేశం బహ్రెయిన్ కి మీరు వెళ్ళినట్లయితే అక్కడి నుండి మీ ఇంటికి కొన్ని వస్తువులను ఖచ్చితంగా తెచ్చుకోండి. ఆ వస్తువులు మీకు ప్రతీసారీ బహ్రెయిన్ ని గుర్తు చేస్తుంటాయి. ఆ వస్తువులేంటో చూద్దాం. ముత్యాలు: బహ్రెయిన్ ని ముత్యాల దీవి అని పిలుస్తారు. ఇక్కడ దొరికే ముత్యాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. సుమారు 4వేల సంవత్సరాల నుండి ముత్యాల మైనింగ్ బహ్రెయిన్ లో జరుగుతుంది. ముత్యాలతో తయారైన ఇయర్ రింగ్స్, ఆభరణాలను మీ ఇంటికి తెచ్చుకుని మీకు కావాల్సిన వారికి అందించండి. ఖర్జూరం: గల్ఫ్ దేశాలకి వెళ్ళినపుడు ఖర్జూర పండ్లు ఖచ్చితంగా కొనాల్సిందే. ఇక్కడ దొరికే ఖర్జూర పండ్లు మంచి రుచి కలిగి ఉంటాయి.
కలపతో తయారైన ధూపం
పెర్ఫ్యూమ్ : బహ్రెయిన్ స్మెల్ చూడాలనుకుంటున్నారా? అయితే పెర్ఫ్యూమ్స్ కొనండి. బహ్రెయిన్ లో రకరకాల పెర్ఫ్యూమ్స్ తయారవుతుంటాయి. సహజ సిద్ధ పదార్థాలతో ఈ పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు. పర్ఫ్యూమ్స్ బాటిల్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చూడగానే కొనాలనిపిస్తుంది. బకూర్: ఇది సువాసన వెదజల్లే ధూపం. కలపతో తయారయ్యే ఈ ధూపాన్ని సుగంధాన్ని వెదజల్లే చెట్టు నుండి తయారు చేస్తారు. ఈ కారణంగా ఈ ధూపం నుండి సువాసన గుబాళిస్తుంది. బహ్రెయిన్ ప్రజలు వీటిని పెళ్ళిళ్ళకు వాడతారు. మీరు మీ ఇంట్లో అలంకారంగా వాడవచ్చు. రగ్గులు: గల్ఫ్ దేశాలు రగ్గులకు ఫేమస్ అని అందరికీ తెలుసు. బహ్రెయిన్ లో దొరికే రగ్గులు చాలా బాగుంటాయి.