Beauty Tips: జెన్నిఫర్ వింగెట్ బ్యూటీ టిప్స్...సింపుల్‌గా ఇలా అందంగా మారిపోండి
ఈ వార్తాకథనం ఏంటి
అందంగా కనిపించాలంటే ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని తాజాగా ఉంచుకోవడంతో పాటు స్టైలిష్ లుక్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. టీవీ నటి జెన్నిఫర్ వింగెట్ తన బ్యూటీ, ఫ్యాషన్ రొటీన్‌తో ఇదే విషయాన్ని చెబుతున్నారు. తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్‌లో వాసెలిన్ కోసం ర్యాంప్‌పై సందడి చేసిన ఆమె.. అందం కోసం పాటించే కొన్ని సింపుల్ టిప్స్‌ను పంచుకున్నారు.
Details
బ్యాగ్‌లో ఉండాల్సిన 3 బ్యూటీ ప్రొడక్ట్స్
రోజూ బయటకు వెళ్లేటప్పుడు జెన్నిఫర్ తన బ్యాగ్‌లో 3 వస్తువులను తప్పనిసరిగా ఉంచుకుంటారట.
అవి లిప్ బామ్, మాయిశ్చరైజర్, స్కిన్ టింట్. పెదవులు పొడిబారకుండా లిప్ బామ్ ఉపయోగపడుతుంది. మాయిశ్చరైజర్ చర్మానికి తేమను అందిస్తుంది.
స్కిన్ టింట్‌తో హెవీ మేకప్ లేకుండానే ముఖానికి సహజమైన లుక్ వస్తుంది. రోజంతా బయట ఉండేవారికి ఈ మూడు వస్తువులు ఉపయోగకరంగా ఉంటాయి.
Details
ఫ్రెష్ లుక్ కోసం షీట్ మాస్క్
అకస్మాత్తుగా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం అలసిపోయినట్లు కనిపిస్తే షీట్ మాస్క్ ఉపయోగిస్తారట జెన్నిఫర్.
ఇవి చర్మానికి తాత్కాలికంగా తేమను అందించి మృదువుగా కనిపించేలా చేస్తాయి. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు కొత్త ప్రొడక్ట్స్ వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది.
Details
పార్టీకి వెళ్లేటప్పుడు చిన్న షిమ్మర్ టచ్
సాయంత్రం పార్టీకి వెళ్లేటప్పుడు శరీరంపై కొద్దిగా షిమ్మర్ అప్లయ్ చేస్తే లుక్‌లో మెరుపు వస్తుందని జెన్నిఫర్ చెబుతున్నారు.
అలాగే ఫ్యాషన్‌లో ట్రెండ్స్ కంటే మనకు నచ్చిన దుస్తుల్లో సౌకర్యంగా ఉండటమే ముఖ్యమని సూచిస్తున్నారు. సరైన ఫుట్‌వేర్ ఎంపిక కూడా సాధారణ అవుట్‌ఫిట్‌ను స్టైలిష్‌గా మార్చగలదు.
అందం అంటే ఎక్కువ మేకప్ కాదు.. మన చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, మనకు నచ్చిన స్టైల్‌లో నమ్మకంగా కనిపించడం. ఇదే జెన్నిఫర్ వింగెట్ బ్యూటీ ఫిలాసఫీ.