New Year 2026: ప్రపంచంలో ముందుగా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేది కిరిబాటి.. ఈ ద్వీపదేశం ప్రత్యేకత ఇదే !
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచం మొత్తం 2026 నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఏడాది అడుగుపెట్టే తొలి క్షణాలు ఎక్కడ మొదలవుతాయన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ప్రపంచంలో నూతన సంవత్సరాన్ని మొట్టమొదట స్వాగతించే ప్రాంతం పసిఫిక్ మహా సముద్రంలోని ద్వీప దేశం కిరిబాటి. ఈ దేశానికి చెందిన కిరిటిమటి (క్రిస్మస్ ఐలాండ్) ద్వీప ప్రాంతమే కొత్త ఏడాదిని ముందుగా పలకరిస్తుంది. ఇక్కడే ప్రతి రోజూ భూమిపై తొలిసారి సూర్యోదయం జరుగుతుంది. కిరిబాటితో పోలిస్తే భారత్‌లో నూతన సంవత్సరం దాదాపు 7 గంటల 30 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమవుతుంది.
వివరాలు
అక్కడ అర్ధరాత్రి... భారత్‌లో ముందు రోజు మధ్యాహ్నం
కిరిటిమటిలో అర్ధరాత్రి సమయం రాగానే అక్కడ నూతన సంవత్సర వేడుకలు మొదలవుతాయి. అదే సమయంలో భారత్‌లో మాత్రం డిసెంబరు 31వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల సమయం అవుతుంది. అంటే మన దేశం కొత్త ఏడాదిలోకి ప్రవేశించేందుకు ఇంకా 7 గంటలకు పైగా వేచి చూడాల్సి వస్తుంది. కిరిబాటి తర్వాత వరుసగా ఆస్ట్రేలియాలో ఉదయం 2.30 గంటలకు, రష్యాలో 2 గంటలకు, న్యూజిలాండ్‌లో 1.15 గంటలకు నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. దాదాపు ఒక రోజు అనంతరం అమెరికాకు చెందిన సమోవా, బేకర్, హౌలాండ్ దీవుల్లో జనవరి 1వ తేదీ మొదలవుతుంది. ప్రపంచంలో కొత్త సంవత్సరంలోకి అత్యంత ఆలస్యంగా అడుగుపెట్టే ప్రాంతాలివే.
వివరాలు
సూర్యోదయానికి శ్రీకారం
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ భూమిపై తొలి సూర్య కిరణాలు ప్రసరించే ప్రాంతం తూర్పు ఆసియాగా గుర్తించబడింది. ఈ ప్రాంతానికి చుట్టూ దక్షిణ పసిఫిక్, మధ్య పసిఫిక్ మహా సముద్రాలు విస్తరించి ఉన్నాయి. ఈ మహా సముద్రాల మధ్య ఉన్న చిన్నచిన్న ద్వీప దేశాల్లోనే ప్రతి రోజు తొలుత ఉషోదయం జరుగుతుంది. అనంతరం తూర్పు ఆసియాలోని జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, తైవాన్, చైనా, మంగోలియా దేశాల్లో సూర్యుడు ఉదయిస్తాడు.
వివరాలు
సూర్యోదయానికి శ్రీకారం
డిసెంబరు 31న కూడా ఇదే క్రమం కొనసాగుతుంది. తమ దేశంలోని అన్ని ద్వీపాలు ఒకే క్యాలెండర్, ఒకే టైమ్ జోన్‌ను పాటించేలా 1995లో కిరిబాటి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమధ్య రేఖకు సుమారు 232 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న దేశం పలు ద్వీపాల సమూహంగా ఉంది. కిరిబాటి జనాభా సుమారు లక్షా 19 వేల మంది. ఈ ద్వీప దేశం 1979లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.