లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: చరిత్ర, కొటేషన్లు, నినాదాలు, తెలుసుకోవాల్సిన విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
లాల్ బహదూర్ శాస్త్రి 1904సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ముఘలసరై ప్రాంతంలో జన్మించారు.
భారతదేశానికి రెండవ ప్రధాన మంత్రిగా 1964 నుండి 1966వరకు పనిచేసారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన నాయకుడు ఆయన.
లాల్ బహదూర్ శాస్త్రి అసలు పేరు, లాల్ బహదూర్ శ్రీ వాస్తవ. పేద కుటుంబంలో జన్మించిన లాల్ బహదూర్ శాస్త్రి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డారు.
కాశీ విద్యాపీఠం నుండి బ్యాచిలర్ పట్టా సాధించారు. స్వాతంత్ర సమరంలో లాల్ బహదూర్ శాస్త్రి క్రియాశీలక పాత్ర వహించారు.
మహాత్మాగంధీ సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు.
Details
దేశ రెండవ ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి
ప్రధాని నెహ్రూ తర్వాత ఇండియాకు ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి ఎన్నికయ్యారు.
ఆయన పదవీకాలంలో, ఇండియా - పాకిస్తాన్ యుద్ధం, ఇండియాలో ఆహార సంక్షోభం ఏర్పడింది. అదే సమయంలో జై జవాన్, జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చారు.
లాల్ బహదూర్ శాస్త్రి ఇతర కొటేషన్లు:
మేము శాంతినీ, శాంతియుత అభివృద్ధిని నమ్ముతున్నాము. కేవలం మనకోసం మాత్రమే కాదు, ప్రపంచం కోసం కూడా.
స్వేఛ్ఛను రక్షించడం కేవలం సైనికుల పని మాత్రమే కాదు, దేశ ప్రజలందరి బాధ్యత.
క్రమశిక్షణ, ఐక్య కార్యాచరణ దేశానికి నిజమైన బలం.
దేశం పట్ల మీకున్న విధేయత ఇతర వాటిపట్ల మీకున్న విధేయతల కంటే చాలా గొప్పది.