LOADING...
Sri Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుడు తెలియజేసిన జీవిత పాఠాలు 
శ్రీకృష్ణుడు తెలియజేసిన జీవిత పాఠాలు

Sri Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుడు తెలియజేసిన జీవిత పాఠాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీకృష్ణ భగవానుడు గొప్ప తత్వవేత్త. ఆయనొక మోటివేటర్. మానవాళికి భగవద్గీతను అందించి ఎలా జీవించాలో తెలియజేశాడు. ఈ నెల 16న(16th August) కృష్ణాష్టమి. ఈ సందర్భంగా కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన జీవిత పాఠాలు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. కర్మ: శ్రీకృష్ణుడు,పని చేయమన్నాడు.. ఫలితం గురించి ఆలోచించవద్దన్నాడు. నువ్వు నీ పని చేస్తుంటే ఫలితం దానంతటదే వస్తుందని తెలియజేశాడు. ఫలితం గురించి ఆలోచించి ఆనందం పొందడం కన్నా పనిచేస్తూ ఫలితం వైపు వెళ్లడంలో ఆనందం పొందాలని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు. ఫలితం ఎలా ఉన్నా పనిలో ఆనందం ఉంటే జీవితం బాగుంటుందని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు.

వివరాలు 

రేపటి గురించి బాధపడకు 

ఈ క్షణంలో జీవించు: రేపటి గురించి ఆలోచిస్తూ లేదా గడిచిపోయిన కాలం గురించి ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేసుకోవడం కంటే ఈ క్షణం, ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలని శ్రీకృష్ణ భగవానుడు మానవాళికి హితబోధ చేశాడు. త్యాగం: జీవితంలో కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. అది ధనమైనా, అహమైనా, గర్వమైనా, కామమైనా.. ఏదైనా సరే, ఒకటి సాధించాలనుకుంటే నువ్వు కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఒప్పుకోవడం: మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు?ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని కచ్చితంగా ఒప్పుకొని తీరాలని భగవద్గీత తెలియజేస్తుంది. ఏది జరిగినా మంచి కోసమే జరుగుతుందని, అందువల్ల అనవసరంగా ఆందోళన, ఒత్తిడి తెచ్చుకోకూడదని జీవిత ప్రయాణంలో పాజిటివ్ గా ఉండాలని శ్రీకృష్ణ భగవానుడు సందేశాన్ని ఇచ్చాడు.