ఆరోగ్యాన్ని అందించే లీచీ పండ్లను సాగు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రైతు: వ్యవసాయంలో వినూత్న విప్లవం
లీచీ పండ్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పండ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిని చైనా రైతులు ఎక్కువగా పండిస్తారు. దాదాపు వేరే దేశాలన్నీ లీచీ పండ్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం ఇండియాలోనూ లీచీ పండ్ల సాగు జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిలాకు చెందిన రైతు, 2.3ఎకరాల్లో లీచీ పండ్లను సాగు చేస్తున్నాడు. కిలోకు 300నుండి 400రూపాయల ధర ఉండే ఈ పండ్ల దిగుబడి తక్కువగా ఉంటుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా వీటికి మంచి డిమాండ్ ఉంది. ఉత్తరప్రదేశ్ లో సాగు చేస్తున్న లీచీ పండ్ల రుచి, కొంచెం ఉప్పగా, కొంచెం తియ్యగా ఉంటుంది.
లీచీ పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
రోగనిరోధకశక్తి పెరుగుతుంది: సి విటమిన్ అధికంగా ఉండడం వల్ల అనవసర రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. రోగాలను సృష్టించే సూక్షజీవులను చంపేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది: యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి గుండెకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. గుండె సంబంధ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీపీని నియంత్రణలో ఉంచుతుంది: పొటాషియం, సోడియం తగిన పరిమాణాల్లో ఉన్నందున బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది: ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పేగుల కదికలు సక్రమంగా జరుగుతాయి. ఈ కారణంగా మలబద్దకం దూరమవుతుంది. అంతేకాదు, కేలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గడంలో సాయం చేస్తుంది.