ప్రేరణ: ఒక రంగంలో నువ్వు ఎదగాలంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి
ఈ వార్తాకథనం ఏంటి
ఒక రంగంలో ఎదగడం అంత ఈజీ కాదు. అందుకోసం ఎంతో కష్టపడాలి. చాలా వదిలేయాలి. ఎన్నో నేర్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో నీ పక్కన ఒకరో ఇద్దరో మనుషులు ఉండాలి.
అవును, నువ్వు ఎదగాలనుకుంటే నీ పక్కన వెన్ను తట్టేవాళ్ళు ఉండాలి. ఎవ్వరూ లేకపోతే నువ్వు జీవితంలో ఎదగలేవు.
ఎందుకంటే నువ్వు ఒక పనిచేస్తున్నప్పుడు ఆ పనిని పొగిడేవాళ్ళు లేదా తిట్టేవాళ్ళు నీ చుట్టూ లేకపోతే ఆ పనిలో నీకు పరిపక్వత రాదు.
ఉదాహరణకు నువ్వొక మంచి బొమ్మ గీశావ్. నీకు చాలా నచ్చింది. దాన్ని వేరే వాళ్లకు నువ్వు చూపించినపుడు చాలా బాగుందని వాళ్ళన్న ఒక్కమాట, నిన్ను మరో మంచి బొమ్మను మరింత శ్రద్ధపెట్టి గీసేలా చేస్తుంది.
Details
ప్రశంస చేసే మ్యాజిక్
ఒకవేళ వాళ్ళు బాలేదు అన్నారనుకో, అంతకంటే బాగా గీయాలన్న కసిని పెంచుతుంది. అదే ఎవ్వరూ ఏమీ అనలేదనుకో, ఏం చేయాలో అర్థం కాక బొమ్మ గీయడం ఆపేస్తారు.
చేస్తున్న పనిలో ఆనందం పొందుతున్నప్పుడు అవతలి వారి ప్రశంస అవసరం లేదని కొంతమంది చెబుతారు. అది నిజమే. కానీ అవతలి వారి నుండి వచ్చే చిన్న ప్రశంస, మీలోని సృజనాత్మకతను మరింత పెంచుతుంది.
నువ్వెంత పనిచేసినా దాన్ని గుర్తించేవారు ఎవ్వరూ లేనపుడు నీకు ఆ పని నుండి సంతృప్తి లభించదు. మనం ఒక వీడియో పెట్టినపుడు అది బాగుందని లైక్ కొట్టినవాళ్ళు కూడా మన భుజం తట్టేవాళ్లే.
Details
ఇచ్చిపుచ్చుకునే అలవాటు
మీ భుజం తట్టాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే అవతలి వారి భుజం తట్టాలన్న సంగతి మీరు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం మీదే ఆధార పడి ఉంటుంది. అది ప్రేరణ అయినా, డబ్బు అయినా, బంధాలు అయినా ఏదైనా అంతే.
అవతలి వారి వర్క్ బాగుందని చెప్పడానికి మంచి మనసు కావాలి. ఆ మనసు మీకున్నప్పుడు మీ వర్క్ గుర్తించే మంచి మనసు మీకు దొరుకుతుంది.
నువ్వేది ఇస్తే అదే తిరిగి వస్తుందని చాలామంది చెబుతారు. ఆ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. అందుకే వీలైనంత మటుకు ఇవ్వడానికి ట్రై చెయ్. నీకు వస్తూ ఉంటుంది. అది ప్రోత్సాహం అయినా, సహాయమైనా, ప్రేమైనా.