నేషనల్ వాల్నట్స్ డే: వాల్నట్స్ తో స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం మే 17వ తేదీన నేషనల్ వాల్నట్స్ డే జరుపుకుంటారు. వాల్నట్స్ మార్కెటింగ్ బోర్డ్ నిర్ణయించిన ప్రకారం, 1950నుండి జాతీయ వాల్నట్స్ దినోత్సవాన్ని జరుపుతున్నారు.
వాల్నట్స్ తో అనేక రకాల రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. స్వీట్స్, సలాడ్స్, స్నాక్స్ లాగా తినవచ్చు.
వాల్నట్ హల్వా:
డిన్నర్ తర్వాత ఈ స్వీట్ తింటే బాగుంటుంది. వాల్నట్స్ ని 15నిమిషాలు నీళ్ళలో నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని వడపోసి వాల్నట్స్ ని, దోసకాయ గింజలను రుబ్బాలి.
రుబ్బగా వచ్చిన మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి వేయించాలి. అందులో పంచదార, పాలు, కుంకుమపువ్వు, యాలకుల పొడి, ఖర్జూరం కలిపి 10నిమిషాలు ఉడికించాలి. అంతే వాల్నట్స్ హల్వా రెడీ అయినట్టే.
Details
నోరూరించే వాల్నట్ కేక్, వాల్నట్ లడ్డు
వాల్నట్ కేక్:
కొంత వెన్న తీసుకుని దానికి చక్కెర కలపి, చక్కెర కరిగేలా మెత్తగా ఒక గ్లాసుతో కొట్టాలి. ఇప్పుడు రెండు గుడ్లు, బేకింగ్ పౌడర్, మైదా, పాలు, కొన్ని వాల్నట్స్ జోడించాలి.
ఈ మిశ్రమాన్ని 30నిమిషాల పాటు బేక్ చేయాలి. ఇప్పుడు గుడ్డు తెల్లసొన, చక్కెర, క్రీమ్ ఒకదగ్గర కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని బేక్ చేసిన కేక్ మీద పోస్తే సరిపోతుంది.
వాల్నట్ లడ్డు:
వాల్నట్స్ ని కొద్దిగా వేయించి పొడిలాగా తయారు చేసుకోవాలి. పెనం మీద నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించాలి. దీనికి కొద్దిగా బెల్లం, వాల్నట్ పౌడర్ కలపాలి. ముక్కలుగా చేసిన డ్రై ఫ్రూట్స్ కలుపుకుని లడ్డూలు తయారు చేస్తే సరిపోతుంది.