Veg Foods : మీరు శాఖాహారులా అయితే ఆరోగ్యమే మహాభాగ్యం..కానీ వాటితో జాగ్రత్త
ఈ వార్తాకథనం ఏంటి
శాఖాహారులకు మంచి పోషకాహారాలు కావాలంటే ఏమి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే అంశాల మీద కాస్త దృష్టి అవసరం.
వెజిటెబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే.
నాన్‌వెజ్ నుంచి వెజ్‌కు మారేవారికి వీటిని తీసుకోవడం కొత్తలో ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. ఫలితంగా వారు మంచి రుచి కోసం కొన్ని పదార్థాలు కలిపి తీసుకుంటుంటారు.
అందువల్ల ఈ టేస్ట్‌ను అందించే ఆహారాలు శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇదే సమయంలో మీరు బరువు పెరిగేందుకు, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడందుకు కారణమవుతాయి.
అందువల్ల వెజ్ ఫుడ్‌లో ఆరోగ్యానికి హాని చేసే షుగర్స్ లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన పెంచుకోవాలి.
Details
హెల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యమే మహాభాగ్యం
ఫేలవమైన జీవనశైలి, మధుమేహం కారణంగా మెరుగైన ఆరోగ్యం కోసం చాలా మంది నాన్ వెజ్ నుంచి వెజ్‌కు మారుతున్నారు.
మొక్కల నుంచి వచ్చే పదర్థాలను, ఆకు కూరలను ఆహారంగా తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ మేరకు శరీరానికి అవసరమైన ప్రోటీన్ వెజ్‌లో దొరుకుతుందని, బీన్స్, టోపు, సోయా వంటి శాకాహార ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల గుండె కాస్త మెరుగ్గా పనిచేస్తుంది.
శాకాహారం తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నాయి.
ప్రోసెసింగ్ ఫుడ్స్,స్వీట్స్,సిరప్స్,తేనే వంటివి తీసుకుంటే మధుమేహ సమస్యలు ఎదురవుతాయంటున్నారు.షుగర్ఫుడ్స్ను తగ్గించుకోవాలని,స్వీట్స్, డిజెర్ట్స్ వంటి వాటిని దూరం పెట్టాలని నిపుణలు సూచిస్తున్నారు.
డైట్లో పండ్లు, తృణధాన్యాలు, కూరగాయలు తీసుకోవాలి. తద్వారా హెల్తీ వెయిట్ పెరిగి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.